ఏందీ… విరాట్ కోహ్లీ ఇచ్చింది కేవలం 3 కోట్లేనా…   

Virat Kohli Fans Covid Donation Coronavirus - Telugu Anushka Sharma, Coronavirus, Covid-19, Donation, Team India Captain Virat Kohli, Virat Kohli

ప్రస్తుతం దేశంలో

కరోనా వైరస్

మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తోందో అందరికీ బాగా తెలుసు.అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

అత్యవసర

లాక్ డౌన్

ని ప్రకటించారు.

 Virat Kohli Fans Covid Donation Coronavirus

దీంతో జనసాంద్రత ఎక్కడికక్కడే స్తంభించిపోయింది.అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లను వదిలి బయటికి రావద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పలువురు రోజువారి కూలీలు, నిరుపేదలు పనులు లేక పస్తులతో అల్లాడుతున్నారు.

ఏందీ… విరాట్ కోహ్లీ ఇచ్చింది కేవలం 3 కోట్లేనా… -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇలా తిండి,తిప్పలు లేక అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకునేందుకు పలువురు

సినీ ప్రముఖులు మరియు వ్యాపార సంస్థల అధినేతలు

ఇప్పటికే తమకు తోచినంత నగదుని విరాళాల రూపంలో అందించారు.అయితే తాజాగా ఇండియన్ క్రి

కెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ

మరియు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ

దంపతులు ఇద్దరు కలిసి

మూడు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు.

ఈ విషయాన్ని అనుష్క శర్మ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.ఇందులో మేము అందించేటువంటి ఈ డబ్బు  కనీసం కొంత మందికి అయినా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని  పేర్కొంది.

దీంతో నెటిజన్లు విరాట్ కోహ్లీ పై మండిపడుతున్నారు.

దాదాపుగా సంవత్సరానికి

ప్రకటనలు రూపంలోనే విరాట్ కోహ్లీ వంద కోట్ల రూపాయలకు

పైగా ఆయాదాన్ని ఆర్జిస్తున్నాడు.దీంతో విరాట్ విరాళంగా కనీసం ఆరునెలల సంపాదన అందించినా 50 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఈ డబ్బు దేశంలో కరోనా వైరస్ కారణంగా బాధ పడుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి విపత్తుల సమయంలోనే ప్రజలను ఆదుకోవాలని కూడా సూచిస్తున్నారు.ఏదేమైనప్పటికీ వందల కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న విరాట్ కోహ్లీ ఇలా చిన్న మొత్తాన్ని కరోనా వైరస్ బాధితులకు సహాయార్థం అందించడం విరాట్ కోహ్లీ అభిమానులే రుచించుకొలేక పోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Virat Kohli Fans Fire About Covid Donation Related Telugu News,Photos/Pics,Images..