వైరల్ వీడియో: మొత్తానికి వామిక కనిపించిందోచ్..!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – నటి అనుష్క శర్మల కుమార్తె వామిక గురించి ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది.దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె వామికా లైవ్‌లో దర్శనమిచ్చింది.

 Virat Kohli Daughter Vamika Viral Video Viral Latest,  Viral News,  Social Medi-TeluguStop.com

ఇప్పటివరకు ఆ చిన్నారిని మీడియాకు చూపించకుండా కోహ్లీ, అనుష్క జాగ్రత్త పడ్డారు. విరాట్-అనుష్కశర్మ లు పలుమార్లు వామిక ఫోటోను షేర్ చేసినా అది వెనకనుంచే.

వామిక ముఖం ఎలా ఉంటుందో ఆమెను చూసినవాళ్లకు తప్ప వేరేవాళ్లకు తెలియదు.కోహ్లి-అనుష్క అభిమానులతో పాటు టీమిండియా అభిమానులు కూడా వామికను విరాట్ ఎప్పుడు పరిచయడం చేస్తాడని ఎదురుచూస్తున్నారు.

గతంలో అనేక పర్యాయాలు కోహ్లీ దంపతులు వామికను ఫొటోలు తీయొద్దని మీడియాకు స్పష్టం చేశారు.అయితే., కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా చివరి వన్డే సందర్భంగా స్టాండ్స్‌లో తల్లి అనుష్క శర్మ చేతుల్లో ఉండగా వామిక కెమెరా కంటికి చిక్కింది.ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే ఇందులో వామిక పూర్తి ముఖం కనిపించకున్నా.ఆ చిన్నారి కళ్లు, ముక్కు సైడ్​ లుక్​లో బాగానే కనిపిస్తుంది.అభిమానులు ఈ ఫొటోను ట్రెండింగ్​ చేస్తూ విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ చేస్తున్నారు.వామిక అచ్చం కోహ్లీలానే ఉందంటూ అభిమానులు పొంగిపోతున్నారు.ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, కెమెరాలు ఒక్కసారిగా అనుష్కవైపు తిరిగాయి.దాంతో ఆమె చంకలో ఉన్న వామికను కూడా కెమెరాలు ఫ్రేమ్ లో బంధించాయి.

కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లి చేసుకోగా, మూడేళ్ల తర్వాత వామిక జన్మించింది.అప్పటినుంచి ఆ చిన్నారి అందరికీ దర్శనమివ్వడం ఇదే ప్రథమం.

గతేడాది జనవరి 11న పుట్టిన వామికా.సౌతాఫ్రికా పర్యటనలోనే తొలి బర్త్‌డే జరుపుకుంది.

అయితే పుట్టినప్పటి నుంచి తన కూతురిని మీడియాకు దూరంగా ఉంచాలని భావించిన విరుష్క దంపుతులు.మీడియా చానెళ్లన్నటికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube