తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కొహ్లీ..!

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కోవిడ్ తొలి వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు.సోమవారం కొహ్లీ తన ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

 Virat Kohli Completed 1st Dose Covid Vaccine-TeluguStop.com

ఈ క్రమంలో అందరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు విరాట్ కొహ్లీ.అసలైతే ఈ టైం కు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండాల్సిన విరాట్ కొహ్లీ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

కరోనా వల్ల ఈ సీజన్ ఐపీఎల్ కు బ్రేక్ పడ్డది.ఇక ఇంట్లో ఉంటూ భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు విరాట్ కొహ్లీ.

 Virat Kohli Completed 1st Dose Covid Vaccine-తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కొహ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా కోవిడ్ పై కోరుకి 2 కోట్ల రూపాయల డొనేషన్ ఇచ్చారు కొహ్లీ.అంతేకాదు తమ వంతుగా విరాళాలు సేకరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు విరాట్ కొహ్లీ, అనుష్క శర్మలు.

వీరు చేస్తున్న ఈ క్యాంపెయింగ్ కు భారీ స్పందన వచ్చింది.డొనేషన్స్ ప్రారంభించిన ఒక్కరోజులోనే 3.6 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి.దేశ ప్రజలపై కరోనా పంజా విసురుతుండగా దానిలో భాగంగా ఎంతోకొంత తమ వంతు సాయాన్ని అందించాలని చూస్తున్నారు విరాట్ కొహ్లీ.

 కరోనా బాధితుల కోసం వారు చేస్తున్న ఈ డొనేషన్స్ సాధ్యమైనంతవరకు కరోనా రోగుల అవసరాలు తీరేలా వాడనున్నారు.

#1st Dose #Virat Kohli #Completed #COvid #ViratKohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు