ఆ లిస్ట్ లో మోడీ ని బీట్ చేసిన విరాట్‌ కోహ్లీ..!

క్రికెట్ మైదానంలో పరుగుల మిషన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి విరాట్ కోహ్లీ.ప్రస్తుతం ఉన్న సమకాలిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అంటే ముందు వరుసలో నిలబడే వ్యక్తులలో విరాట్ కోహ్లీ ఒకడు.

 Virat Kohli Beats Modi In That List, Pm Modi, Virat Kohili, Beats,instagram, Soc-TeluguStop.com

విరాట్ కోహ్లీ కేవలం మైదానంలో పరుగులు చేసి శతకాల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో తనదైన మార్క్ చూపిస్తూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు.తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంస్టాగ్రామ్ లో ఓ అద్భుతమైన రికార్డును నమోదు చేసినట్లు “హైప్ ఆడిటర్” అనే సంస్థ విశ్లేషించింది.

ఇందులో భాగంగానే.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 స్థానాన్ని సంపాదించాడు.

అయితే ఈ లిస్టులో ఓ ఆశ్చర్యకరమైన అంశం ఉంది.అదేంటంటే.

భారత్ తరఫున విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిలిచారు.ప్రపంచవ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రతిభావంతమైన వ్యక్తుల లిస్టులో 20వ స్థానాన్ని సంపాదించారు.

వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ ప్రముఖ నటి అయిన అనుష్క శర్మ ప్రపంచవ్యాప్తంగా 26 స్థానాన్ని చేజిక్కించుకుంది.

ఇకపోతే ఈ లిస్ట్ లో ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు రోనాల్డ్ మొదటి స్థానం సంపాదించగా.

మరో ఫుట్ బాల్ ఆటగాడు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక భారతదేశంలో కోహ్లీ, మోడీ, అనుష్క శర్మ తర్వాత దీపికా పడుకొనే స్థానాన్ని సంపాదించింది.అంతేకాకుండా ట్విట్టర్ ఇండియా తాజాగా వెల్లడించిన లిస్టులో భారతదేశంలో ఎక్కువ మంది వెతికిన క్రీడాకారులలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.ఇక అదే మహిళ క్రీడాకారుల విషయానికి వస్తే.

రెజ్లర్ గీత పొగట్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత పీవీ సింధు, సైనా నెహ్వాల్ నిలిచారు.ఇక ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విరాట్ కోహ్లీ జంట తాము తల్లిదండ్రులము కాబోతున్నట్లు చేసిన ట్వీట్ అత్యధికంగా ట్రెండ్ అయింది.

ఈ పోస్ట్ కు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్ల వర్షం కురిశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube