కోహ్లీ ఒక మెషీన్ లాంటి వాడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మెషీన్ లా బ్యాటింగ్ చేస్తాడని ఆ జట్టు (ఆస్ట్రేలియా) ఆటగాడు ఆడం జెంపా తెలిపాడు.పూణేపై విజయం సాధించడంపై జెంపా మాట్లాడుతూ, అందర్లా కోహ్లీ వస్తూనే బౌలర్లపై విరుచుకుపడడని అన్నాడు.

 Virat Kohli Batting Like Machine- Adam Zampa-TeluguStop.com

తొలుత పిచ్, బంతులను అర్ధం చేసుకుంటాడని తెలిపాడు.కుదురుకునేందుకు కొన్ని బంతులను తీసుకుంటాడని, ఆ తరువాత పరుగుల యంత్రంలా పరుగులు చేసుకుంటూ పోతాడని, అలుపు సొలుపు ఉండదని జెంపా తెలిపాడు.

పూణేపై విజయాన్ని సాధించి పెట్టిన ఇన్నింగ్స్ అద్భుతమని జెంపా ప్రశంసించాడు.రానున్న మ్యాచ్ లలో ఇదే జోరు కొనసాగిస్తామని జెంపా ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, ప్రతి మ్యాచ్ లో విజయం సాధిస్తే కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాకౌట్ స్టేజ్ కు చేరే అవకాశం లేదన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube