వైర‌ల్‌.. బిడ్డ కోసం సింహాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టిన జీబ్రా..

ప్ర‌పంచంలో త‌ల్లి ప్రేమ ముందు ఎలాంటి ప్రేమ అయినా తేలిపోతుంది.బిడ్డ ఆప‌ద‌లో ఉంటే అంద‌రికంటే ముందు త‌న ప్రానాల‌ను అడ్డుగా పెట్టి పోరాడేది కేవ‌లం త‌ల్లిమాత్ర‌మే.

 Viral  Zebra Threatening Lion For Baby .  Viral Video, Zebra Beats Lion, Lion ,-TeluguStop.com

అందుకే త‌ల్లి ప్రేమ‌కు సాటి ఎవ్వ‌రూ రాలేర‌ని చ‌రిత్ర చెబుతోంది.ఇక త‌ల్లి నుంచి బిడ్డ‌ను వేరుచేయ‌డం అనేది క‌ల్ల‌.

త‌ల్లి బ‌తికున్నంత వ‌ర‌కు బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూనే ఉంటుంది.ఇక త‌ల్లి ప్రేమ విష‌యంలో ఏ ప్రాణి అయినా ఒక్క‌టే.

జంతువుల్లో కూడా త‌ల్లి ప్రేమ స్వ‌చ్ఛంగానే ఉంటుంది.ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూశాం.

బిడ్డకు ఆప‌ద వ‌చ్చిందంటే చాలాఉ త‌న ప్రాణాల‌ను సైతం అడ్డువేసి కాపాడే జంతువుల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం.అడ‌వి అంటేనే వేట‌తో ద‌ద్ద‌రిల్లిపోతుంది.ఇక్క‌డ ఒక జీవి బ‌త‌కాలంటే మ‌రో జీవి మ‌ర‌ణించాల్సిందే.అదే సృష్టి ధ‌ర్మం.

కాగా ఇలా బిడ్డ‌ల కోసం సాధు జంతువులు క్రూర మృగాల‌కు కూడా బ‌లైపోతున్నాయి.ఇప్పుడు కూడా ఇలాంటి త‌ల్లి ప్రేమ‌కు అద్దం ప‌ట్టే వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.

ఇందులో సింహం ఓ జీబ్రా గుంపు మీద దాడి చేస్తుంది.దీంతో దానికి ఓ బుల్లి జీబ్రా పిల్ల దొరికిపోతుంది.

ఇక దాన్ని తినేందుకు సింహం సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలోనే త‌ల్లి జీబ్రా క్ష‌ణాల్లో అక్క‌డ‌కు చేరుకుంటుంది.ఇక బిడ్డను ఎలాగైనా ఆ సింహం నుంచి కాపాడుకునేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతుంది.ఏకంగ‌నా సింహంతోనే పోరాడేందుకు రెడీ అవుతుంది.ఇందులో భాగంగా త‌న వెనక కాళ్ల‌తో సింహాన్ని ఎగిరి తంతూ బిడ్డ నుంచి దూరంగా వెళ్ల‌గొడుతుంది.చివ‌ర‌కు సింహం దాని దాడికి భయప‌డి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.ఇదంతా కూడా అక్క‌డున్న వారు రికార్డు చేయ‌గా నెట్టింట దీన్ని షేర్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు బాగా పాపుల‌ర్ అవుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube