వైరల్ : కార్లే కోవిడ్ వార్డులు...!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.చాలా మంది సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు.

 Viral Youngsters Helping Covid Patients By Turning Their Cars As Covid Wards , V-TeluguStop.com

మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు.దేశంలో ఇప్పటికీ ఆక్సిజన్, బెడ్స్ కొరత కనిపిస్తోంది.

ప్రభుత్వం వీటికి సంబంధించి చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు.ఇటువంటి తరుణంలో చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు.

కొంత మంది ఆక్సిజన్ ఏర్పాటు చేస్తుంటే మరికొందరు బెడ్స్ ను ఏర్పాటు చేస్తూ కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నారు.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతంలో కొందరు యువకులు తమ సాయాన్ని అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ యువకులు తమ సొంత వాహనాలను మొబైల్ కొవిడ్ వార్డులుగా మార్చి కరోనా పేషెంట్లకు భరోసాను అందిస్తున్నారు.కరోనా పేషెంట్లకు ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే అక్కడకు వెళ్లి వారికి ఆక్సిజన్ అందిస్తున్నారు.

నాలుగు కార్లలో ఒకటి ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మరొక కారు వోల్క్స్ వాగేన్ పోలో కార్లను కోవిడ్ వార్డులుగా మార్చేశారు.ఆరుగురు స్నేహితులు ఈ కార్లలో వెళ్లి ప్రతిరోజు ఆరుగురు రోగులకు సహాయం చేస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగులు క్యూలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు.ఆక్సిజన్ ఎవరికైనా అవసరం అయితే తాము వెళ్లి వారికి సహాయం చేస్తున్నారు.

సొంత డబ్బుతో వీరు కరోనా పేషెంట్లకు సహాయం చేస్తున్నారు.రానున్న రోజుల్లో తమ కార్లను పూర్తిస్థాయిలో అంబులెన్స్ గా మార్చివేయనున్నట్లు తెలిపారు.

కనీసం 40 నుంచి 50 మందికి సహాయం చేయాలని వారు అనుకుంటున్నారు.ప్రభుత్వాసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రారంభించాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వెళుతున్నాయి.ఆక్సిజన్ సిలిండర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి ఇబ్బందులు తమ పరిధిలో రాకుండా తాము ముందుండి పోరాడుతామని వారు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube