వైరల్: ఈ సర్పంచ్ ఐడియా చేస్తున్న పనికి వావ్ అనాల్సిందే...!

ప్రస్తుతం కరోనా వైరస్ భారత దేశ వ్యాప్తంగా ఎలాంటి తీవ్రరూపం దాలుస్తుందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి రోజు వేల సంఖ్యలో భారతదేశంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న, లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Viral Wow Analsinde For The Work That This Sarpanch Idea Is Doing-TeluguStop.com

ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు చూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.కరోనా వైరస్ నిర్మూలన కోసం దేశంలోని చాలా రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా నిబంధనలు పాటిస్తూఅలాగే కరోనా నిబంధనలు పాటించని వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

వైరస్ కేవలం పట్టణాలు, నగరాల్లో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా విజృంభిస్తుండడంతో గ్రామంలోని పెద్దలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా గ్రామ పెద్దలు సర్పంచ్ లు వారి గ్రామాల్లో కరోనా పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.

 Viral Wow Analsinde For The Work That This Sarpanch Idea Is Doing-వైరల్: ఈ సర్పంచ్ ఐడియా చేస్తున్న పనికి వావ్ అనాల్సిందే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటికి నిర్ములనకు వారి వంతుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఓ సర్పంచ్ కొత్త పద్ధతుల్లో ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ దూసుకెళ్తున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూను అమలు చేసే బాధ్యతను అతడు స్వయంగా తీసుకున్నాడు.

జిల్లాలోనే నాగులుప్పలపాడు మండలం ఓమ్మొరం గ్రామం సర్పంచ్ బాలకోటి తన గ్రామ ప్రజలకు కరోనా నివారణకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు తన సొంత బైక్ పై ఓ మైకు పట్టుకొని గ్రామంలోని ప్రతి ఒక్క వీరికి తిరుగుతూ కరోనా వైరస్ నిర్మూలించేందుకు జాగ్రత్తలను తెలుపుతున్నాడు.దేశంలో కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని దయచేసి ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని ఆయన వారి ప్రజలను హెచ్చరిస్తున్నాడు.

ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలని అలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, అంతేకాకుండా సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని తెలియజేశారు.ఈయన ఇదివరకు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనుభవం కారణంగా ఆయన మైకు పట్టుకుని చైతన్య గీతాలు పాడుతూ ప్రతి ఒక్కరిని మేల్కొలుపుతున్నడు.

స్థానికులు కూడా సర్పంచ్ చేసే ఈ పనిని చూసి ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.ఇందుమూలంగా సర్పంచ్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారని కాబట్టి, వారిని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఎంతో ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సర్పంచ్ పై నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Viallge #COVID-19 #Carona Virus #Sarpanch Idea #Carona Effetc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు