వైరల్: వరల్డ్ ఆర్మ్ రేస్లింగ్ ఛాంపియన్ నెగ్గిన ఇండియన్..!

మన భారతదేశంలో క్రీడలు అంటే ముఖ్యంగా చెప్పుకునే వాటిలో క్రికెట్ పేరు మాత్రమే వినిపిస్తుంది.మిగతా క్రీడలకు క్రికెట్ కు ఉన్న ఆదరణ లభించడం లేదు.

 India’s Armwrestling, Champion, Viral Latest, Viral News, 70kg,rahui Panikkar,-TeluguStop.com

భారతదేశంలో క్రీడాకారులు కేవలం క్రికెట్ లో మాత్రమే కాకుండా మిగతా క్రీడా రంగాలలో కూడా వారి ప్రతిభను చాటుతూ భారతదేశ సత్తా ప్రపంచ నలుమూలల చూపిస్తున్నారు.తాజాగా ఆర్మీ రెజ్లింగ్ సర్క్యూట్ లో దేశంలోని కేరళ రాష్ట్రం కొచ్చి ప్రాంతానికి చెందిన రాహుల్ పానిక్కర్ నేషనల్ స్టేజికి చేరుకున్నాడు.70 కేజీల బరువున్న ఫార్మెట్ లో భాగంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ రెజ్లింగ్ ఛాంపియన్ తాజాగా ప్రముఖ వరల్డ్ స్ట్రాంగెస్ట్ బాడీ బిల్డర్ అయిన ల్యారి వీల్స్ తో పోటీ పడి ఘన విజయాన్ని అందుకున్నాడు.

తాజాగా జరిగిన మ్యాచ్ లో ల్యారీ వీల్స్ తో పోటీపడి అతనిని సూపర్ మ్యాచ్ లో ఓడించి రికార్డు సాధించాడు.

ఈ మ్యాచ్ లో మొదటి రెండు రౌండ్ లలో ఓడిపోయిన తర్వాత అదిరిపోయే ఫార్మెన్స్ తో వరుసగా మూడు రౌండ్ లు గెలుచుకొని రికార్డు సృష్టించాడు.ఈ ఆటకు సంబంధించిన వీడియోను తాజాగా ఇండియన్ ఆర్మీ రింగ్ ఫెడరేషన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ పోటీలు దుబాయ్ లో జరిగింది.ఈ మ్యాచ్ జరిగిన అనంతరం ఇండియన్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో రాహుల్ కు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

Telugu Kg, Indias, Latest-Latest News - Telugu

ఇక రాహుల్ విషయానికి వస్తే.ఇతను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా.ఇతడికి మొదటి నుంచి ఆటలపై మక్కువ ఎక్కువ.ఇక వీరి కుటుంబం విషయానికి వస్తే.తన తండ్రి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్.ఈయన కూడా పవర్ లిఫ్టర్.రాహుల్ తండ్రికి పవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా ఉంది.

ఈయన నలుగురు అన్నదమ్ములు కూడా ఫిట్నెస్ రంగంలోనే ఉన్నారు.అంతేకాదు వారి అంకుల్ కూడా వెయిట్ లిఫ్టింగ్ మాజీ ఛాంపియన్.

అలాగే ఆయన టీమిండియాకు కోచ్ గా కూడా వ్యవహరించాడు.ఇలా మొత్తానికి రాహుల్ ఫిట్నెస్ రంగం ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో అతనికి మంచి సపోర్ట్ లభించడంతో ఈ అపూర్వమైన విజయాన్ని సాధించాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube