వైరల్ : మాస్కు లాగ మొఖానికి పెయింటింగ్ వేసుకున్న యువతి...చివరికి..?

టీ షర్ట్‌ల నుంచి సాక్స్‌, జీన్స్‌, వ్యాక్యూమ్‌ బ్యాగ వరకూ… ఇవన్నీ వేర్వేరు వస్త్రాలతో తయారవుతాయి.అలాంటి వాటికి ఉపయోగించే మెటీరియల్స్‌ తో చేసిన మాస్కులను చాలామంది ఉపయోగిస్తున్నారు కూడా.

 Viral Women Paints As Mask In Indonesia Passport Seized , Mask Painting, Viral N-TeluguStop.com

అయితే ఇక్కడో యువతి ఇంకో రకం పని చేసింది.దాంతో ఆవిడ చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లైయ్యింది.

మాస్క్ పెట్టుకోమంటే కొంత మంది ఎందుకో గానీ వ్యతిరేకిస్తారు.అలాంటి ఓ యువతి… అచ్చం మాస్క్ లాగా పెయింటింగ్ వేసుకుంది.

ఇండోనేషియాలో ఓ యువతి చేసిన పని ఆమెని చిక్కుల్లో పడేసింది.

ఇండొనేసియా లోని పర్యాటక ప్రాంతం బాలిలో జోష్ పాలెర్ లిన్, లియా సీ జంట షాపింగ్ చేసింది.

అయితే షాపింగ్ చేయాలంటే మాస్క్ తప్పనిసరి అని సెక్యూరిటీ గార్డు యువతిని అనుమతి ఇవ్వలేదు.దీంతో మాస్క్ లాంటి పెయింటింగ్ వేసుకుంది.కారులో బ్లూ కలర్ పెయింట్ వేసుకోవడం, చెవులకు మాస్క్ దారం ఉన్నట్లుగా వైట్ కలర్ పెయింటింగ్ వేసుకుంది.తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో మాస్క్ లు వేసుకుని సూపర్ మార్కెట్ కు వచ్చారు.

దూరం నుంచి ఆమెను చూసిన వారికి… ఆమె మాస్క్ పెట్టుకున్నట్లే కనిపించింది.దీంతో ఆమె షాపింగ్ మాల్‌ లోకి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డు కూడా గుర్తించలేకపోయాడు.

అయితే, ఆ యువతి భర్త మాత్రం మాస్క్ పెట్టుకున్నాడు.ఆపై సదరు జంట వీడియోలు తీసుకున్నారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

దీంతో ఇండోనేషియా అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా నివారించే మార్గంలో మాస్క్ కచ్చితంగా ఉపయోగించాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube