వైరల్: కోపంతో కుక్కపై కాల్పులు చేసిన మహిళ.. గురితప్పి కొడుకుపై..?!

ఒక తల్లి తన ఐదేళ్ల కొడుకును యాక్సిడెంటల్‌గా కాల్చేసిన ఘటన టెక్సాస్ నగరంలో బయటపడింది.హూస్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి వీధి కుక్కను కాల్చాలనుకుంది.కానీ ఆ బుల్లెట్ కుక్కకు బదులుగా, ఆమె సొంత కొడుకును తాకింది.24 ఏళ్ల ఏంజెలియా మియా వర్గాస్ తన కొడుకు, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి వీధిలో సైక్లింగ్ చేస్తోంది.ఈ సమయంలో పక్కింటి కుక్క అయిన 6 నెలల బ్రూనో కూడా వీధిలో తిరుగుతోంది.అంతే క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది.అకస్మాత్తుగా కాల్పుల శబ్దం విన్నామని ఇరుగుపొరుగు వారి చెబుతున్నారు.డిటెక్టివ్ జె.హస్లీ అనే మహిళ.ఏంజెలియా బ్రూనోపై మూడుసార్లు కాల్పులు జరిపినట్లు చెప్పింది.

 Viral Woman Shoots Dog Bullet Misfires And Hits Son-TeluguStop.com

ఇక అనుకోకుండా ఓ బుల్లెట్ తన కొడుకును తాకింది.ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ, బ్రూనో యజమాని ఆ రాత్రి పిల్లాడి అరుపులు విన్నట్లు చెప్పారు.

 Viral Woman Shoots Dog Bullet Misfires And Hits Son-వైరల్: కోపంతో కుక్కపై కాల్పులు చేసిన మహిళ.. గురితప్పి కొడుకుపై..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రమాదంలో బ్రూనో కాలికి కూడా స్వల్పంగా గాయమైనట్లు వివరించారు.

Telugu America, Bihar, Bruno, Bullet, Dog, Gun Misfires, Hit, Little Boy, Mother Fired, Muzaffarpur, Rajkumar, Shoots Son, Texas, Viral, Viralnews-Latest News - Telugu

ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి బాగానే ఉందని చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.ఇండియాలో కూడా ఇటువంటి తరహా ఘటనే ఒకటి చోటుచేసుకుంది.బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో తన పెంపుడు కుక్కను క్రూరంగా హింసించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.యజమాని తన పెంపుడు కుక్కను దారుణంగా కొట్టడంతో కన్ను పోయిందని జంతువుల హక్కుల కార్యకర్త సుమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu America, Bihar, Bruno, Bullet, Dog, Gun Misfires, Hit, Little Boy, Mother Fired, Muzaffarpur, Rajkumar, Shoots Son, Texas, Viral, Viralnews-Latest News - Telugu

దీంతో కుక్క యజమాని రాజ్ కుమార్ పై జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి భగీరత్ ప్రసాద్ చెప్పారు.పెంపుడు జంతువు యొక్క పరిస్థితి గురించి ఆరా తీయడానికి రాజ్ కుమార్ ఇంటికి వెళ్లినపుడు కుక్క యజమాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జంతువుల హక్కుల కార్యకర్త సుమంత్ ఆరోపించారు.

#Muzaffarpur #Mother Fired #Bullet #Shoots Son #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు