వైర‌ల్‌.. మ్యాగీని ఇలాకూడా రెడీ చేస్తారా..

రెండు నిముషాల్లో రెడీ అయ్యే మ్యాగీ అంటే తెలియ‌ని వారు ఉండ‌రేమో.కానీ వంట‌కాల్లో చాలా డిఫ‌రెంట్ ఉంటాయి.

 Viral Will Maggie Ready Like This-TeluguStop.com

ఒక ప‌ద్ధ‌తిలో చేయాల్సిన మ్యాగీని మ‌రో ర‌కంగా కూడా చేస్తుంటారు చాలామంది.ఎందుకంటే పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని చెప్పారు క‌దా పెద్దలు.

మ‌రి ఆ మాట‌ను నిజం చేసి చూపించేందుకు అయినా ఇలాంటి వారు అలా చేయ‌డం కామ‌న్‌.ఇక‌పోతే ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాగీ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు.

 Viral Will Maggie Ready Like This-వైర‌ల్‌.. మ్యాగీని ఇలాకూడా రెడీ చేస్తారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మిగ‌తా వంట‌ల‌కు చాలా స‌మ‌యం ప‌డితే ఈ మ్యాగీకి మాత్రం రెండు నిమిషాల్లో రిస్క్ లేకుండా రెడీ చేసుకోవ‌చ్చు కాబ‌ట్టి దీన్ని చిన్నా పెద్దా అంద‌రూ ఇష్టపడుతారు.

ఇలా రుచికరంగా ఉండే మ్యాగీని సిద్ధం చేసుకోవాలంటే మిగ‌తా వంట‌కాల్లాగా పెద‌ద్గా శ్రమించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

అయితే మ్యాగీని కూడా చాలామంది చాలా రకాలుగా చేసిన‌టువంటి వీడియోలు ఇప్ప‌టికే ఎన్నో వైర‌ల్ అయ్యాయి.మ్యాగీని కొంద‌రు పాణిపూరి, అలాగే పులిహోరా, ఉప్మా, లాంటి వాటితో కూడా క‌లిపి ఫ్రై చేశారు చాలామంది.

కాగా వీట‌న్నింటికంటే కూడా కొంచెం డిఫ‌రెంట్ గా ఆలోచించి త‌యారు చేసిన కొత్త వంటకం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఇందులో మ్యాగీని కొత్త‌గా పాలతో రెడీ చేశారు.

దీంతో దీన్ని మ్యాగీ మిల్క్ షేక్ అని పేరు పెడుతున్నారు.

ఈ వీడియోలో మ‌న‌కు మ్యాగిని ఓ బౌల్‌లో తీసుకుని అందులో పాలు పోయ‌డం క‌నిపిస్తుంది.రెగ్యూలర్‏గా పాలను కేవ‌లం స్వీట్ల‌లో లేదంటే కొన్ని వంట‌కాల్లో మాత్ర‌మే వాడుతుంటారు.ఇలా మ్యాగీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వాడ‌లేదు.

కానీ వీరు మాత్రం అందుకు భిన్నంగా మ్యాగీలో ఇలా పాలు పోసి దాన్ని చాలా డిఫ‌రెంట్ గా వండేస్తున్నార‌ని మ‌న‌కు వీడియోలో క‌నిపిస్తుంది.ఇలాంటి ఢిపరెంట్ వంటకాలు చేస్తే ఇంకేమైనా ఉత్త‌గానే వైర‌ల్ అవుతుంటాయి క‌దా.

ఇది కూడా అలాగే ఇట్టే వైర‌ల్ అయిపోయిదంఇ.ఇక దీన్ని ట్రై చేసేందుకు చాలామంది ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు.

#Social Media #Milk #Milk Shake #Viral #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు