వైర‌ల్‌... భ‌ర్త‌ను ఆఫీస్‌కు రప్పించాల‌ని వేడుకున్న భార్య‌.. ఎందుకంటే..?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా చాలా కంపెనీల్లో ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ న‌డుస్తోంది.దీంతో వారంతా కూడా దాదాపుగా ఏడాదికి పైగా ఇంటి నుంచే జాబులు చేస్తున్నారు.

 Viral Wife Pleading To Bring Her Husband To The Office Because, Work From Home,-TeluguStop.com

అయితే ఇలా వారు వ‌ర్క్ ఫ్ర‌మ్ చేయ‌డం వ‌ల్ల ఇంట్లో కూడా చాలా ర‌కాల ఇబ్బందులు వ‌స్తున్నాయి.ఇంట్లో గొడ‌వ‌లు ఎక్కువ కావ‌డం లేదంటే ప‌ని గంట‌లు ఇలా కొన్ని ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇక మ‌హిళ‌ల‌కు అయితే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ‌గా ఉంటున్నాయి.ఎందుకంటే టైం టైం అన్న కండీఆష‌న్లు ఏమీ లేకుండా పొద్దంతా భ‌ర్త‌లు ఇంట్లోనే ఉంటున్నారు.

దీంతో త‌న భ‌ర్త వ‌ల్ల తాను పడుతున్న ఇబ్బందుల గురించి ఓ మ‌హిళ వివరిస్తూ ఓ భార్య తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ భ‌ర్త ఆఫీసుకు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.విష‌యం ఏంటంటే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష్ గొయొంకా ఈ విధంగా వెల్ల‌డించారు.

ఆయ‌న త‌న ట్విట్టర్ ఖాతాలో ఆ లేఖ‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్టు చేస్తూ దీనిపై ఎలా స్పందించాలో తెలియ‌ట్లేద‌న్న‌రు.ఆమె ఏం చెప్పిందంటే.తన భర్త చాలా కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నార‌ని, ఆయ‌న పేరు మనోజ్ అని తెలిపింది.

Telugu Harsh Goenka, Socila, Vial, Letter Company-Latest News - Telugu

కాగా త‌న భ‌ర్త ఇంట్లో రోజూ చాలా సార్లు కాఫీ తాగుతున్నాడ‌ని, పైగా ఆయ‌న‌కు ఎక్క‌డ కూర్చుంటే అక్క‌డ‌కు వెల్లి కాఫీ ఇవ్వాల‌ని తెలిపింది.ఇక రోజుకు మూడు సార్లు తినే త‌న భ‌ర్త ఇప్పుడు లెక్కలేనన్ని తింటున్నాడ‌ని, పైగా ఆయ‌న పనిచేసేటప్పుడు కునికిపాట్లు పడుతున్నాడంటూ త‌న లేఖ‌లో ఆమె వెల్ల‌డించింది.ఇక త‌మ‌కు ఇప్ప‌టికే ఇద్దరు పిల్లలున్నార‌ని వారితో పాటు భ‌ర్త‌కు కూడా అన్ని సపర్యలు చేయడం అంటే త‌న‌కు చాలా క‌ష్టంగా మారింద‌ని, కాబ‌ట్టి త‌న భ‌ర్తను ఆఫీసుకు పిలిపించాలంటూ వేడుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube