వైరల్: డబ్బుని దొంగలిస్తున్న కాకి.. ఎందుకబ్బా..!?

ఇంటర్నెట్ ని షేక్ చేసే వైరల్ వీడియోలు వస్తూనే ఉంటాయి.అయితే తాజాగా ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 Viral Why This Strange Cow Is Robbing The Money, Crow Stealing ,currency Notes,-TeluguStop.com

ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.విషయం ఏంటంటే.

మనం కాకుల గురించి ఎన్నో కథలు విన్నాం.ముఖ్యంగా కాకికి దాహం వేసినప్పుడు కుండలో అడుగు భాగంలో ఉన్న నీటిని రాళ్ళూ వేసి నీటిని పైకి తెప్పించుకొని మరి తాగిన కథలు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.

ఇక్కడే మనకి కాకి తెలివి కూడా కనిపిస్తుంది.అలా నీళ్లనే కాదు కింద ఉన్న తినే వాటిని కూడా తెలివిగా ఎత్తుకెళ్తుంది.

అయితే ఒక కాకి మాత్రం ఏకంగా కరెన్నీ నోట్లుని ఎత్తుకెళ్ళి దాచుకుంటుంది.ఇదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో.

వైరల్ అవుతున్న వీడియోలో కాకి ఒక కిటికీ నుంచి ఫ్లాట్ లోపలికి వచ్చి ఒక టేబుల్ పై వాలుతోంది.దాని ముక్కుకు ఉన్న కరెన్సీ నోట్ ని అక్కడ టేబుల్ కి ఉండే డెస్క్ లో వేస్తోంది.

అయితే అక్కడ చాలా నోట్లు ఉండడంతో అన్ని నోట్లని ఆ కాకే తెచ్చిందా అనే ప్రశ్న వస్తుంది.ఆ నోట్లు అక్కడ ముందే ఉన్నాయా లేదా నిజంగా కాకే తెచ్చిందా అనేది ఎవరికీ తెలీదు.

ఆ నోట్లని చూస్తుంటే మాత్రం కాకే దొంగలించి తెచ్చి దాచిపెట్టినట్టే ఉంది.ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోని చూసిన వారందరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు ఇదేం దొంగ కాకి ఇలా ఉందని అంటుంటే.మరికొందరు ఆ డబ్బుని గుడ్లు కొనడానికి దొంగిలించిందని అంటున్నారు.మరికొందరు., వావ్.వాట్ ఏ వండర్ ఇలాంటి కాకులు కూడా ఉంటాయా.? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మనుషులతోనే కాదు పక్షులతో కూడా జర జాగ్రత్తగా ఉండాలన్నమాట అనే ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఈ వీడియోని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube