వైరల్: ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు, ఎవరి టేస్టు వారిది మరి... ఆ తిండి చూసి అవాక్కవ్వొద్దు మరి!

ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు వుంది వీరి నిర్వాకం.ప్రపంచంలో విభిన్న రుచులు.

 Viral Whose Madness Is Their Happiness, Whose Taste Is Theirs And , Viral Latest , Viral News , Social Media , Food , Eating ,mix Two To Three Curries , Pastry Maggie-TeluguStop.com

అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్ని ఆహారపదార్ధాలను కలిపేసి తినేయమంటాడు హీరోని.దాంతో హీరో అవాక్కయి, బ్రహ్మానందానికి ఒక్కటిస్తాడు.

అయితే అది సినిమా.కానీ నిజ జీవితంలో అలాంటివారు లేకపోలేదు.

 Viral Whose Madness Is Their Happiness, Whose Taste Is Theirs And , Viral Latest , Viral News , Social Media , Food , Eating ,Mix Two To Three Curries , Pastry Maggie-వైరల్: ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు, ఎవరి టేస్టు వారిది మరి#8230; ఆ తిండి చూసి అవాక్కవ్వొద్దు మరి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనలో కొంతమంది రెండు మూడు కూరలను మిక్స్ చేసి తినేస్తూ వుంటారు.అది వారికి రుచికరంగా ఉన్నప్పటికీ చూసేవారికి మాత్రం ఒకింత అసహ్యంగా ఉంటుంది.

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు ఎవరి టెస్టులు వారిని అన్న మాదిరి కొంతమంది ప్రవర్తిస్తుంటారు.తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్‌ మీడియా పుణ్యామాని ఇలాంటివి చూడాల్సి వస్తోంది.వంటకాలను మామ్మూలుగా చేస్తే ఎవరు చూస్తారు అనుకుంటున్నారో ఏమో కానీ, కాస్త పైత్యాన్ని జోడించి కొంతమంది ఇరగదీస్తున్నారు.

రుచి మాట దేవుడెరుగు? కానీ సదరు వీడియోలకు మంచి లైక్స్, షేర్ లు లభిస్తున్నాయి.కొంతమంది ఊహకు కూడా అందని కాంబినేషన్స్‌తో వంటలు చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.మొన్న మ్యాంగో మ్యాగీ అయితే నేడు పేస్ట్రీ మ్యాగీ వైరల్‌ అవుతోంది.

పేస్ట్రీతో మ్యాగీని తయారు చేశాడు ఓ నెటిజన్‌.దీనిని వీడియోగా తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశాడు.

దీనికోసం ముందుగా ఓ ప్యాన్‌ను స్టౌవ్‌పై ఉంచి, ఆయిల్‌ వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేశారు.అవి కాస్త ఏగాక, ఓ పేస్ట్రీని ప్యాన్‌లో వేసి అందులో నీరు పోశారు.పేస్ట్రీ మొత్తం నీళ్లలా మారిన తర్వాత అందులో మ్యాగీతో పాటు, మసాలా వేశారు.చివరిగా పేస్ట్రీ మ్యాగీని సర్వ్‌ చేశారు.ఈ పేస్ట్రీ మ్యాగీ రుచి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంది కదూ! వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే స్పందిస్తున్నారు.నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోపై మీరూ చూసేసి మీమీ అభిప్రాయాలు తెలియజేయండి మరి!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube