వైర‌ల్‌.. రెండు పులులు క‌లిసి గ‌ర్జిస్తే ఇలాగే ఉంటుందా..

చాలా సినిమాల్లో మ‌న‌కు వినిపించే ఒక డైలాగ్ అది పులి గురించే ఉంటుంది.పులి పంజా లేదంటే పులి గ‌ర్జ‌న‌కు సంబంధించిన విష‌యాలు ఎప్ప‌డూ గంభీరంగానే ఉంటాయి.

 Viral   What Would Happen If Two Tigers Roared Together .., Viral Video, Tigers-TeluguStop.com

పులి గ‌ర్జన అంటే మామూలుగా ఉండ‌దు.ఆ గ‌ర్జ‌న‌కే ప్రాణాలు పోయేంత భ‌యం పుడుతుంది.

అందుకే దీన్ని సినిమా హీరోల‌కు అన్వ‌యించుకుంటూ రాస్తుంటారు.మ‌రి సినిమాల్లో హీరోల డైలాగులే పులి గ‌ర్జ‌న‌ను త‌ల‌పిస్తే నిజంగానే పులి గ‌ర్జ‌న ఇంకెలా ఉంటుందో ఊహించండి.

అడ‌విలో నిత్యం పులి గ‌ర్జ‌న వినిపిస్తూనే ఉంటుంది.అది అక్క‌డ స‌ర్వ సాధార‌ణం.

పులుల్లో పెద్ద‌పులి గ‌ర్జ‌న అన్నింటికంటే భ‌యంక‌రంగా ఉంటుంది.అది గ‌ర్జిస్తే కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపిస్తుంది.

దాని గ‌ర్జ‌న‌కు ఎంత‌టి పెద్ద జంతువులు అయినా స‌రే ప‌రుగులు పెట్టాల్సిందే.ఇలాంటి పులి గ‌ర్జ‌న‌కు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది.

అయితే ఇందులో డ‌బుల్ ధ‌మాకా అన్న‌ట్టు ఒక్క పులి కాదండోయ్ ఏకంగా రెండు పులులు క‌ల‌సి త‌మ లోప‌ల ఉన్న కోపాన్ని గ‌ర్జ‌న రూపంలో వ‌దిలితే అడ‌వి ద‌ద్ద‌రిల్లుతోంది.మామూలుగ రెండు పులులు క‌లిస్తే పోట్లాడుకుంటాయి.

కానీ ఇందులో రెండు పులి పిల్ల‌లు ఇలా అరుస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఇండియాలో పులుల సంఖ్య క్ర‌మేనా పెరుగుతుంద‌ని అంద‌రికీ తెలుసు.ముఖ్యంగా పెద్ద పులుల సంఖ్య‌ను పెంచేందుకు ఫారెస్ట్ అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగానే ఫ‌లిస్తున్నాయి.ఇప్పుడు ఓ అడ‌విలో పెద్ద పులి తన పిల్లలతో కలిసి ఓ చోట ఉంది.

త‌ల్లి పిల్లల‌కు క‌నిపించేస‌రికి పిల్ల‌లు అరుస్తున్నాయి.అయితే పిల్ల పులులకు త‌ల్లి ఎలా గ‌ర్జించాలో నేర్పుతున్న‌ట్టు మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తోంది.

దీన్ని కొంద‌రు వీడియో తీయ‌గా ఐఏఎస్ ఆఫీస‌ర్ సుప్రియ సాహు త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.ఇంకేముంది అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube