వైరల్: ఆకాశానికి కన్నం పడిందా ఏమిటి? ఆ వర్షాన్ని ఏమనాలి?

మనకి సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల వీడియోలు తారసపడుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో మనకు ఆనందాన్ని కలిగిస్తాయి.

 Viral What Happened To The Sky What Should We Call That Rain , Sky , Rain , Vira-TeluguStop.com

ఓ రకంగా ఈ విశ్వంలో దాగున్న అద్భుతాలన్నంటినీ అరచేతిలో చూపిస్తున్న క్రెడిట్‌ సోషల్‌ ఒక్క మీడియాకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా అలాంటి ఓ ఆశ్చర్యకరమైన వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

అప్పటి వరకు నిర్మానుశ్యంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది.ఆ వెంటనే ఆకాశానికి కన్నం పడిందా అన్నమాదిరిగా కుంభవృష్టి వర్షం కురిసింది.

బహుశా, ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడూ చూసుండరు.

సుమారు ఓ గంట సేపు కురవాల్సిన వర్షం నీరు కొన్ని క్షణాల్లో కురిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అలా జరిగితే మీకు చూడాలని వుందా? అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఖచ్చితంగా చూడండి.వండర్‌ ఆఫ్‌ సైన్స్‌ అనే ట్విట్టర్‌ హాండిల్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.పీటర్‌ మేయర్‌ అనే ఫొటో గ్రాఫర్‌ ఈ వీడియోను చిత్రీకరించినట్లు వీడియోలో పేర్కొన్నారు.

ఈ వింతని రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో లక్షల వ్యూస్ సంపాదిస్తోంది.

బేసిగ్గా మేఘాలు ఇలా ఉన్నట్లుండి కురవడాన్ని “క్లౌడ్‌ బర్ట్స్‌” పిలుస్తుంటారు.

ఇక వీడియోలో కంటెంట్ ఒకసారి చూసినట్లయితే, ఆస్ట్రీలియాలోని మిల్ల్‌స్టట్‌ అనే సరస్సు వద్ద రెండు పర్వతాల మధ్య నల్లటి మబ్బులతో వేగంగా కదులుతూ వచ్చింది.ఆ సమయంలో మేఘాల్లోని నీరు ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసింది.

సాధారణంగా మేఘాలు భూ ఉపరితలం నుంచి 12-15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి.ఈ విషయమై వెదర్‌ ఎక్స్‌పర్ట్‌ అనురంజన్‌ కుమార్‌ రాయ్‌ ఓ మీడియా వేదికగా ప్రత్యేకంగా మాట్లాడారు.

ఒక చోట ఆకస్మాత్తుగా వర్షం కురవడాన్ని క్లౌడ్‌బర్ట్స్‌గా పిలుస్తుంటారని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube