వైరల్ : మూడో కంటికి దొంగ దొరికిపోవడంతో ఏం చేశాడంటే..?!

ప్రస్తుత కాలంలో దొంగల పరిస్థితి మరి దారుణంగా ఉందనే చెప్పాలి.ఎందుకంటే పర్సులు దొంగతనం చేద్దామా అంటే ప్రతి ఒక్కరు పర్సులలో డబ్బులకు బదులు ఎటిఎం కార్డులు, క్రెడిట్ కార్డులు పెట్టుకుని తిరుగుతున్నారు.

 Viral What Did The Thief Do After Caught In A Robbery, Theif, Shopping Mall, Vir-TeluguStop.com

అలా అని ఏదన్నా షాపింగ్ మాల్లో దొంగతనం చేద్దామా అంటే అక్కడ కూడా వాళ్లకి చుక్కెదురవుతుంది.ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి దొంగల చేతికి సంకెళ్లు వేసేస్తున్నారు.

పోలీసులు కూడా దొంగ అని తెలిస్తే చాలు వాళ్ళ బెండు తీసేస్తున్నారు.దీనితో అసలు దొంగతనం చేయాలన్నా గాని భయపడి పోతున్నారు.

తాజాగా ఒక వ్యక్తి ఇలాగే షాపింగ్ మాల్లో దొంగతనం చేసి సీసీ కెమెరాలను చూసి అతను చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే భలే నవ్వు వస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం భలే నవ్వుకుంటున్నారు.ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఏమి చేసాడంటే .ఒక వ్యక్తి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో షాపింగ్ మాల్ లోకి ప్రవేశించాడు.ఆ తర్వాత మెల్లగా అక్కడ అలమరాలలో సర్ది ఉన్న ఒక ప్యాకెట్‌ను తీసి వెంటనే తన టీ షర్ట్‌ లోపల దాచుకుంటాడు.

ఆ తరువాత సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లే క్రమంలో అక్కడ అమర్చిన సీసీ టీవీ చూసి అమ్మా దొంగ.దొరికిపోయా.అన్నట్టు చూడడాన్ని ఆ వ్యక్తి గమనిస్తాడు.సీసీటీవీని చూసి ఒక్క క్షణం అలా బ్లాంక్ అయిపొయి కొద్దిసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు.

అలా సీసీ టీవీ వంక చూస్తూ దొంగిలించిన ప్యాకెట్‌ను తిరిగి మళ్ళీ అదే స్థానంలో పెడతాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.ఈ 16 సెకన్ల వీడియో టైరీస్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.ఈ వీడియోను నెటిజన్లు సైతం బాగా లైక్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube