వైరల్: తన టాప్-5 ఫేవరెట్ ఆటగాళ్ల జాబితాలో అతను కూడా..!

త్వరలో టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది.ఈ తరుణంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ తనకు నచ్చిన 5 మంది క్రికెటర్ల పేర్లను తెలిపాడు.

 Viral Westindies Cricketer Kieron Pollard Picks His Top 5 Best Cricketers, Viral-TeluguStop.com

తన ఫేవరెట్ ఆటగాళ్లలో ఓ పాపులర్ ఓపెనర్‌, మాజీ వికెట్‌ కీపర్‌, ఆల్‌రౌండర్‌, మాజీ స్పిన్నర్‌, మాజీ పేసర్‌ ఉండటం విశేషం.కీరన్‌ పొలార్డ్‌ ఫేవరెట్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్ల గురించి తెలియజేయడంతో అతని ఎంపికపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

పోలర్ట్ టీ20 క్రికెటర్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, శ్రీలంక టీమ్ లసిత్ మలింగ ఉన్నాడు.అలాగే వెస్టిండీస్ జట్టులోని మరో ఆటగాడు సునిల్ నరైన్ ఉన్నాడు.

ఇండియాకు సంబంధించి ఎంఎస్ ధోనీ కూడా పోలర్డ్ జట్టులో ఉన్నాడు.ఇకపోతే తాను మెచ్చిన నచ్చిన ఆటగాళ్ల లిస్టులో తనపేరును పోలర్డ్ చేర్చుకోవడం విశేషం.

క్రిస్ గేల్ తెలియని వారు ఉండరు.అతను బ్యాట్ పట్టాడంటే గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే.టీ20 ఫార్మాట్ లో క్రిస్ గేల్ మొత్తం 446 మ్యాచులు ఆడగా.14261 రన్స్ చేసి 145.87 స్ట్రైక్‌ రేటుతో కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకూ గేల్ 22 సెంచరీలు కొట్టాడు.

అత్యధికంగా 175 రన్స్ చేశాడు.

ఇకపోతే లసిత్ మలింగ అంటే యార్కర్ల రారాజు అని అందరికీ తెలుసు.

ఎంతో గొప్ప గొప్ప దిగ్గజ బ్యాటర్లను అతడు అవలీలగా యార్కర్లతో ఔట్ చేసిన రికార్డు ఉంది.

Telugu Chris Gayle, Lasith Malinga, Msdhoni, Polard, Sunil, Top, Top Cricketers,

టీ20 ఫార్మాట్‌లో మలింగ 295 మ్యాచ్‌ లు ఆడి మొత్తం 390 వికెట్లు తీశాడు.అయితే సెప్టెంబరు 15న అతడు టీ20కి గుడ్ బై చెప్పాడు.విండీస్‌ క్రికెటర్ సునిల్‌ నరైన్‌ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని కూడా పోలర్డ్ తన జాబితాలో చేర్చుకున్నాడు.టీ20లో 185 క్యాచ్‌లు, 84 స్టంపింగ్‌ లు చేసిన వికెట్‌ కీపర్‌ గా ధోని రికార్డుకెక్కాడు.ఇకపోతే చివరగా పొలార్డ్‌ తనను తన జాబితాలో చేర్చుకున్నాడు.టీ20లో పోలర్డ్ 298 వికెట్లు తీసి ఆల్రౌండర్‌ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube