సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి.అలాంటి కంటెంట్ చూసినపుడు మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది.
తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.మనలో కొంతమందికి చాలా ప్రత్యేకమైన అభిరుచులు ఉంటాయి.
అందులో ఫోటోగ్రఫీ ఒకటి.అందులో కూడా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ( Wildlife photography ) అని ఒకటుంటుంది.
ఇది చాలా కష్టంతో కూడుకున్న జాబ్ అయినప్పటికీ ఎంతో శ్రమకోర్చి చేస్తూ వుంటారు.ఈ ప్రొఫెషన్ అనేది చాలా ఓపికతో చేయాల్సి ఉంటుంది.</
ఇక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు కొన్ని గంటలపాటు నిరీక్షిస్తూ తమకు ఇష్టమైన దృశ్యాలను కెమెరాలలో బంధిస్తూ వుంటారు.ఇప్పుడు ఈ తంతంతా ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది దానికి సంబందించిన వీడియో మరి.అవును, తాజాగా ఓ ఉడుత( squirrel )ను ఇంటర్వ్యూ చేసిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌కి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఉడుత చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
విషయం ఏమంటే ఉడుతను ఇంటర్వూ చేయడానికి ‘జూలియన్ రాడ్( Julian Rodd )’ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దాని దగ్గరకు వెళ్లాడు.ఆ సమయంలో ఆ ఉడుత అతనిని పెద్దగా పట్టించుకోకుండా గడ్డిపూలను తింటూ ఉండడం ఆ వీడియోలో మనం చూడవచ్చు.కాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు జూలియన్.దాంతో సదరు వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.కాగా జూలియన్ షేర్ చేసిన ‘ఉడుత ఇంటర్వ్యూ’( Squirrel Interview ) వీడియోను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.కొందరు నెటిజన్లు “ఈ ఫోటోగ్రాఫర్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు ఇష్టంలేదు.
నా తిండి నేను తింటాను” అని కామెంట్ చేస్తే, మరికొందరు “నేను నీతో మాట్లాడను.నేను చాలా బిజీ” అంటూ ఉడుత ఫీల్ అవుతోందని కామెంట్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు.