వైరల్: భార్య, కూతురు ఫోటోలు పోస్ట్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విరాట్..!

నేడు యావత్ ప్రపంచం మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు మహిళ దినోత్సవ సందర్భంగా ప్రముఖ నటీమణులు, ప్రముఖ దిగ్గజాలు, క్రికెటర్ లు వారి స్టైల్ లో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Viral Virat Kohli Celebrates Womens Day With Wife Anushka Sharma And Daughter Posts Pic-TeluguStop.com

తాజాగా విరాట్ కోహ్లీ తన భార్య హీరోయిన్ అయినా అనుష్క శర్మకు, కూతురు వామిక కు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ అనుష్క తన కూతురుతో ఆడుతున్న ఫోటోను జత చేశాడు.

ఇంస్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ.“మహిళా ఒక బిడ్డకు జన్మనివ్వడం చూడడం కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది.జీవితంలో నమ్మశక్యం కాని ఒక అద్భుతమైన అనుభవం అది.ప్రసవ వేదనను దగ్గర నుంచి చూస్తే మహిళల నిజమైన శక్తి దైవత్వం ఇట్లే అర్థమవుతుంది.దేవుడే వారి రూపంలో ఒక జీవితాన్ని నిర్మించాడు అన్న విధంగా ఉంటుంది.

 Viral Virat Kohli Celebrates Womens Day With Wife Anushka Sharma And Daughter Posts Pic-వైరల్: భార్య, కూతురు ఫోటోలు పోస్ట్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విరాట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆడవారు మన మగ వాళ్ళ కంటే బలమైన వాళ్ళు.జీవితంలో ఎంతో అమూల్యమైన మహిళలకు హ్యాపీ మదర్స్ డే అంతే కాకుండా కూతురు వామిక కూడా తల్లిగా ఎదగాలని ఆశిస్తున్నా.

మహిళా ప్రపంచానికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు ” అంటూ కోహ్లీ విషెష్ ను తెలియజేశాడు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఈయన తో పాటు ఎంత మంది ప్రముఖులు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

#Wishes #Women's Day #Vamika #Virat Kohli #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు