వైరల్ వీడియో: తన వెనక కాళ్ళతో జీబ్రా సింహాన్ని ఏకంగా..?!

అడవిలోని జంతువులన్నీ సింహం నుంచి దూరంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే వేట అనేది సింహం స్వభావం.

 Viral Video Zebra Kicks The Lion With Its Two Back Legs-TeluguStop.com

సింహం అడవికి రాజు.అది కోరుకున్న చోటికి వెళ్లి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది.

అయితే, కొన్నిసార్లు మాత్రం సింహానికి వేటాడటానికి చాలా కష్టపడాల్సివస్తోంది.నిజానికి సింహం ఎంత బలంగా ఉన్నా కొన్నిసార్లు అది కూడా దెబ్బలు తినాల్సి ఉంటుంది.

 Viral Video Zebra Kicks The Lion With Its Two Back Legs-వైరల్ వీడియో: తన వెనక కాళ్ళతో జీబ్రా సింహాన్ని ఏకంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్‌ గా మారింది.

ఈ వీడియోలో జీబ్రాను పట్టుకోవటానికి అడవి లోని ఓ సింహం వేగంగా పరిగెత్తడం గమనించవచ్చు.

అంతేకాదు జీబ్రా కూడా తన ప్రాణాలను కాపాడటానికి బాగా పరుగెడుతూ ఉంటుంది.అయినా కానీ సింహం జీబ్రాపై పంజా విసురుతుంది.కరెక్ట్ గా అదే సమయంలో జీబ్రా తన వెనక రెండు కాళ్లతో సింహానికి ఒక్క కిక్ ఇచ్చింది.దాంతో జీబ్రా వెనకాల ఉన్న సింహం ఎగిరి ఎక్కడో పడుతుంది.

దీంతో జీబ్రా సమయస్ఫూర్తితో సింహానికి దొరకదు.ఇక ఇది ఇలా ఉండగా దీని తరువాత ఏం జరిగిందో వీడియోలో లేదు.

కాబట్టి జీబ్రా తప్పించుకోగలిగిందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం.ఈ వైరల్ వీడియోను వొవాఫ్రికా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియోకు చాలా కామెంట్స్, లైకులు రావడంతో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్స్.సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఏ జంతువైనా సింహం నుంచి తప్పించుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

#ViralAnimals #Forest #Social Media #Lion #Zebra Vs Lion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు