వైర‌ల్ వీడియో.. గ్రామ ర‌క్ష‌క్ ద‌ళ్ ఉద్యోగాల కోసం ఎగ‌బ‌డ్డ యువ‌కులు..

నిరుద్యోగం ఇప్పుడు మ‌న దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న అతి పెద్ద రోగం.దీని బారి నుంచి బ‌య‌ట ప‌డాలంటే అంత ఈజీ కాదు.

 Viral Video  Young People Who Went For Gram Rakshak Dal Jobs Details, Gram Raksh-TeluguStop.com

ఇప్ప‌ట‌కి ఎంద‌రో దీని ధాటికి బ‌లైపోతున్నారు.మ‌రీ ముఖ్యంగా క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఇది విప‌రీతంగా వ్యాపిస్తోంది.

క‌రోనా వ‌చ్చాక ల‌క్ష‌లాది మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు.ఇదే ఇప్పుడు పేద‌రికానికి దారి తీస్తోంది.

డిగ్రీలు, పీజీలు చ‌దివిన వారు కూడా చిన్న ఉద్యోగం కోసం ఎగ‌బ‌డుతున్నారు.నెల‌కు రూ.10వేలు ఇచ్చినా చాలు ఏ ప‌ని అయినా చేస్తాం అనేంత‌లా ఉద్యోగాల కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్నారంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితులకు అద్దం ప‌ట్టే వీడియో ఒక‌టి ఇప్పుడు మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం.

దాన్ని చూసిన త‌ర్వాత మీ కండ్లు త‌డి ఆర‌క మాన‌వేమో.ప్ర‌స్తుతం నిరుద్యోగుల ద‌య‌నీయ స్థితికి అద్దం ప‌డుతున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా సాడ్ కామెంట్లు పెడుతున్నారు.ప్ర‌స్తుతం గుజరాత్‌లో రాష్ట్రంలో గ్రామ రక్షక్ దళ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వేశారు.

ఇందులో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.అయితే ఈ ఉద్యోగం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు వ‌చ్చారు.

దీంతో ఊహించ‌ని రీతిలో ర‌ద్దీ నెల‌కొంది.ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్త పరిస్థితులుగా మారిపోయాయి.దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.నిల‌బ‌డేందుకు కూడా ప్లేస్ లేకుండా తొక్కిసలాట జరిగే ప్రమాద స్థాయికి ప‌రిస్థితులు వెళ్లాయి.దీంతో త‌ప్ప‌క పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చిందంటే నిరుద్యోగులు ఏ స్థాయిలో వ‌చ్చారో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు విప‌రీతంగా వైల‌ర్ కావ‌డంతో నెటిజ‌న్లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంత దారుణ‌మైన ప‌రిస్థితులు వ‌చ్చాయా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube