వైర‌ల్ వీడియోః ఈ ఏనుగు చేసిన ప‌ని చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు..!

ఏనుగులు చాలా బలం ఉన్న జంతువులు.ఏనుగులతో పెట్టుకోవడానికి ఎంతటి వారైనా రెండో సారి ఆలోచిస్తారు.

 Viral Video You Can't Help But Laugh When You See The Work Done By This Elephant-TeluguStop.com

కానీ ఇంత బలం ఉన్న ఏనుగులు కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటూ….ఇతర అడవి జంతువులకు హాని తలపెట్టకుండా జీవనం కొనసాగిస్తాయి.

ఏనుగులకు పుట్టిన పిల్లలు కూడా పరిమాణంలో మిగతా జంతువులతో పోలిస్తే పెద్దగానే ఉంటాయి.ఇప్పుడు ఇలా ఓ ఏనుగు పిల్ల చేసిన అల్లరి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇంతకీ ఆ ఏనుగు పిల్ల ఏం చేసిందంటే….

ఓ అటవీ శాఖ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏనుగు పిల్ల అల్లరిని చూసి నెటిజన్లు మురిసి పోతున్నారు.దానికి అతడు ఇవి జీవితంలో చిన్నపాటి మధురానుభూతులు అనే క్యాప్షన్ కూడా జత చేశాడు.ఇక వీడియోలో ఏముందంటే… ఒక మైదాన ప్రాంతంలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు ఉంటాయి.

అలా అక్కడ ఉన్న సీమ కోళ్లను చూసిన పిల్ల ఏనుగు సంతోషపడుతుంది.సంతోషంలో ఆ సీమ కోళ్ల వెంట పరుగెడుతూ… సరదాగా ఆడుకుంటుంది.కానీ ఆ సీమ కోళ్లు ఏనుగు తమ వెంట రావడం చూసి భయపడిపోతూ… తప్పించుకుంటాయి.ఇలా సీమ కోళ్ల వెంబడి పరుగెత్తుతున్న పిల్ల ఏనుగు కింద పడిపోయింది.

ఇది చూసిన పక్కనే ఉన్న తల్లి ఏనుగు తన పిల్ల వద్దకు వస్తుంది.ఇలా ఆసక్తికరంగా ఉన్న వీడియోను అటవీ శాఖ అధికారి షేర్ చేయగా… ప్రస్తుతం అది చూసిన నెటిజన్లందరూ తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

రకరకాల కామెంట్లు చేస్తూ… హోరెత్తిస్తున్నారు.జూలై 15న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 600 మంది రీట్వీట్ చేయడం గమనార్హం.

ఇలా గున్న ఏనుగు హల్చల్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube