వైర‌ల్ వీడియోః మీ కండ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు.. గుర్రం ఎటు న‌డుస్తోందస‌లు..?

విచిత్ర సంఘటనలతో పాటు వింతలు, ప్రత్యేకమైన సందర్భాల్లో పలువురు చేసిన డిఫరెంట్ పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనకు తెలుసు.అయితే, ఇలాంటివే వైరల్ లేదా ట్రెండవుతాయని మనం చెప్పలేం.

 Viral Video You Can Not Believe Your Eyes What Is The Horse Running-TeluguStop.com

ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో నిలకడగా చెప్పలేని పరిస్థితులు నేటి సోషల్ మీడియా యుగాన నెలకొని ఉన్నాయి.అయితే, ఎప్పుడైనా డిఫరెంట్ వీడియోలు చూసేందుకు జనాలు, నెటిజనులు ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే ఓ వింత వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.అదేంటంటే.

 Viral Video You Can Not Believe Your Eyes What Is The Horse Running-వైర‌ల్ వీడియోః మీ కండ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు.. గుర్రం ఎటు న‌డుస్తోందస‌లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో‌ జనాలను ఆలోచింపజేసేలా ఉంది.మీరు కూడా వీడియో చూసిన వెంటనే మీ మెదడుకు కొంచెం పని చెప్పాల్సి వస్తుంది.సదరు వీడియోలో గుర్రం నడుస్తుంటుంది కానీ అది వెనకకా? లేక ముందుకా? అనేది కనిపెట్టడం కష్టమవుతుంది.దత్తధమయంతి అనే యూజర్ ట్విట్టర్ వేదికగా గుర్రం ఏ మార్గంలో వెళ్తుందో మీరు గమనిస్తే చెప్పండి అనే క్యాష్షన్ జత చేసి షేర్ చేసిన ఈ వీడియో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.

అనలైటికల్, ఫాక్ట్ అండ్ లాజికల్ ఓరియెంటెడ్ టైప్‌ క్వశ్చన్‌లా ఉండే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే వీడియోలో మీకు ఒకవేళ గుర్రం కుడివైపునకు వెళ్తున్నట్లు అనిపిస్తే రైట్ బ్రెయిన్ పర్సన్ అని, ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తే లెఫ్ట్ బ్రెయిన్ పర్సన్ అని పేర్కొంటున్నారు.

వీడియో చూసిన చాలామంది హార్స్ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తున్నదని భావించారు.అయితే, దగ్గరగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తే అది అది బ్యాక్ వర్డ్ డైరెక్షన్‌లో వెనుకకు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఈ వీడియో చూసిన చాలా మంది హార్స్ ఎటు వైపునకు అడుగులు వేస్తుందనేది తెలుసుకోలేక అయోమయంలో ఉన్నారు.ఇక నెట్టింట షేర్ చేయబడిన వెంటనే ప్రజలు దీనిపై స్పందిస్తున్నారు.హార్స్ ఫ్రంట్ సైడ్ వెళ్తుందా? బ్యాక్ సైడ్ వెళ్తుందా? అనేది చెప్పడం అంత ఈజీ కాదని కొంతమంది చెప్తున్నారు.కాగా, కొందరు ఇదో వండర్ ఫుల్ వీడియో అని పేర్కొంటున్నారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోను చాలా మంది యూజర్లు రీట్వీట్ చేస్తున్నారు.ఫజిల్ మాదిరిగా ఉండే ఈ వీడియోను పోస్ట్ చేసే ముందు రీసెర్చ్ చేసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

#HorseWalking #Viral Video #Backward #Horse #LeftBrain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు