వైరల్ వీడియో: వర్షపు నీటిలో చిన్నారి వేడుకోలు…!  

Yadadri Boy Pleaded Collector Floods effected crop fields, Yadadri Boy , Viral Video, Floods , Crop Fields, Social media - Telugu Crop Fields, Fields, Floods, Social Media, Viral Video, Water, Yadadri Boy, Yadadri Boy Pleaded Collector Floods Effected Crop Fields

ఈమధ్య చాలా పనులు సోషల్ మీడియా ద్వారానే పరిష్కారం అవుతున్నాయి.అవును.

TeluguStop.com - Viral Video Yadadri Boy Crop Fields Floods

ప్రపంచం నలుమూలలా టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో, ఏ చిన్న సమస్య వచ్చినా సరే.వాటిని వీడియో రూపంలో అధికారులకు చేర్చి దానికి సత్వర పరిష్కారం చూపే విధంగా కొంతమంది వీడియోలు తీసి అందుకు పరిష్కార మార్గాలను వెతుకుతున్నారు.ప్రస్తుతం అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియో సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - వైరల్ వీడియో: వర్షపు నీటిలో చిన్నారి వేడుకోలు…-General-Telugu-Telugu Tollywood Photo Image

గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు వర్ష ప్రభావం వల్ల మునిగిపోయాయి.ముఖ్యంగా చేతికొచ్చిన పంటలు వర్షపు నీటితో మునిగిపోయాయి.

ఇక ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరి కి చెందిన ఐలయ్య కు చెందిన వరిసాగు పూర్తిగా నీట మునిగిపోయింది.అది ఎంతలా అంటే… అసలు అక్కడ పొలం ఉందని చెప్పే పరిస్థితులు లేకుండా అయిపోయింది.

ఆ ప్రాంతంలో ఉండే పంటలు మొత్తం పూర్తి చెరువులను తలపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా చెరువుగా మారిన చేనులో ఐలయ్య కొడుకు వరుణ్ నిలబడి ఆదుకోండంటూ అడిగిన విధానం చూస్తే చాలా మంది ప్రజల మనసులను కదిలిస్తుంది.

వర్షం వల్ల తమ పంట పూర్తిగా నీట మునిగిందంటూ, వాస్తవ పరిస్థితులు ఇలాగే ఉంటాయి అంటూ అధికారులకు తాను విన్నవించుకున్నాడు.సరైన తూములు లేకపోవడం వల్ల వర్షపునీరు మొత్తం తమ పొలాల్లో చేరి తీవ్ర నష్టం జరిగిందని తెలియజేశాడు.

తమ పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్వాలేదని, ఇకపై ఎవరి పంటలు ఇలా అవ్వకుండా చూడండి అంటూ అధికారులను కోరాడు.రైతన్న అంటూ చాలా మంది గొప్పగా చెబుతారని.

కాకపోతే, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారిని ఎవరూ పట్టించుకోరంటూ ఆ అబ్బాయి ఆవేదన వ్యక్తం చేశాడు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

#Water #Crop Fields #Fields #Social Media #Yadadri Boy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Yadadri Boy Crop Fields Floods Related Telugu News,Photos/Pics,Images..