వైరల్ వీడియో: అక్కడ అత్యంత చెత్త అపార్ట్‌మెంట్ అదేనట..!

ఒక్క నెలకి లక్ష రూపాయల్లో రెంట్ కట్టగలిగే స్తోమత ఉంటే ఫైవ్ స్టార్ హోటల్ లో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు.వేల రూపాయలు చెల్లించినా ఏసీ, టీవీ లతోపాటు ఉచిత వైఫై సౌకర్యాలను అందించే ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి.కానీ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నెలకి 1650 డాలర్ల(రూ.1,20,100) అద్దె వసూలు చేసే ఒక అపార్ట్మెంట్ లోపల చూస్తే మాత్రం ఎవరైనా దిమ్మ తిరిగి కింద పడిపోవాల్సిందే.ఎందుకంటే ఆ అపార్ట్మెంటు లోపల మనిషి కూడా తిరగలేనంత ఇరుకుగా వుంటుంది.గాలి రావడానికి కేవలం ఒక చిన్న విండో తప్పించి మరే ఇతర విండో ఏ మూలన కూడా కనిపించదు.

 Netizens, Tik Tok, Viral Video, Viral News, The Worst Apartment, New York,-TeluguStop.com

అత్యంత చిన్న గా ఉండే కిచెన్ లో స్టవ్ వంటి సౌకర్యాలు కూడా ఉండవు.
ఫ్రీజర్ కూడా లేదు కానీ చిన్న అలమారా మరియు అత్యంత చిన్న ఫ్రిడ్జ్ ఉంది.

ఇవి ఉండి కూడా వృధా.బాత్రూం కి వెళ్ళాలి అంటే మూడు గదులను దాటి వెళ్లాల్సి ఉంటుంది.

ఎవరూ గంట సేపు కూడా ఉండలేని ఈ అపార్ట్మెంట్ లక్షల్లో అద్దెను వసూలు చేయడం నిజంగా షాకింగ్ విషయమే.ఇంకో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లోని టాయిలెట్ లో చేతులు శుభ్రం చేసుకోవడానికి సింక్ కూడా లేదు.

అయితే వెస్ట్​ విలేజ్ ఏరియాలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో పొరపాటున అద్దెకు దిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్​ కామెరూన్ ప్రస్తుతం బాగా పశ్చాత్తాప పడుతున్నారు.అసలు ఈ అపార్ట్మెంట్ వారు ఎందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు? అపార్ట్మెంట్ ఎంత వరస్ట్ గా ఉందో మీరే చూడండి అంటూ ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే టిక్ టాక్ లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.ఈ వీడియోని రెండు కోట్ల మంది నెటిజన్లు చూశారు.ఈ చెత్త అపార్ట్మెంట్ కి నెలకి వేల డాలర్లు కట్టడం కంటే వేరే ప్లేస్ లో ఒక ఇల్లు కనుక్కోవచ్చు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఎవరో కామెరూన్ బయట పెట్టలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube