వైరల్ వీడియో : రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేల్చివేత..!

మామూలుగా మనం దీపావళి పండగ వచ్చినప్పుడు మాత్రమే టపాకాయలను చూస్తూ ఉంటాము.అయితే అది మన చేతిలో పట్టేంత చిన్న టపాకాయలను చూస్తూనే ఉంటాం.

 Bomb Blast, Poland, Second War, Officers, Viral Video, 2400 Kg Bomb, Royal Airfo-TeluguStop.com

మరి ఏకంగా 2400 కేజీల పేలుడు పదార్థం ఉన్న బాంబును ఎప్పుడైనా చూశారా.? అంత పెద్ద బాంబు పేల్చడం లాంటి విషయాలను ఎప్పుడైనా విన్నారా…? అయితే తాజాగా 2400 కేజీల పేలుడు పదార్థం ఉన్న ఓ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అది పేలిపోయింది.ఆ సమయంలో అందుకు సంబంధించి వీడియో రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన ఒక బాంబు పేలకుండా అలాగే ఉండిపోయింది.అయితే ఈ మధ్యనే ఆ విషయాన్ని పోలాండ్ అధికారులు గుర్తించారు.

ఈ బాంబును గుర్తించి ఓ సంవత్సరం కూడా గడిచిపోయింది.ఈ అత్యంత బరువు ఉన్న ఈ బాంబు 1945లో యుద్ధనౌక పై రాయల్ ఎయిర్ఫోర్స్ వారు ప్రయోగిస్తే అది అక్కడ పేలేకుండా అలాగే ఉండిపోయింది.

నిజానికి అది ఐదు టన్నుల బరువు కలిగినది.అయితే అందులో 2400 కేజీల పేలుడు పదార్థం ఉంది.

ఈ బాంబుకు అధికారులు టాల్ బాయ్ అని పేరు కూడా నామకరణం చేశారు.

అయితే ముందుగా ఈ బాంబు సంబంధించి పేలచడం లాంటివి చేయకుండా కేవలం నిర్వీర్యం చేయాలని భావించారు.

ఇకపోతే ఇందుకోసం సముద్రాన్ని వేదికగా చేసుకొని దీన్ని నిర్వీర్యం చేద్దామనుకున్నారు.కాకపోతే అనూహ్యంగా ఆ అతి భారీ బాంబు పేలింది.దీంతో నీరు ఉప్పెనలా మారి ఒక్కసారిగా అమాంతం పైకి ఎగిసిపడింది.ఇందుకు సంబంధించిన తతంగం మొత్తం వీడియోలో చిత్రీకరించారు.

ఈ బాంబు నిర్వీర్యం చేసే సమయంలో ఎందుకైనా మంచిదని ముందుగానే అధికారులు అందుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రజలను మొత్తం ఖాళీ చేయించారు అధికారులు.ఇకపోతే జరిగిన పొరపాట్ల కారణంగా బాంబు పేలడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అంత పెద్ద బాంబ్ ను ఎలా పెల్చారో మీరు కూడా చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube