వైరల్‌ వీడియో : పిల్లల కోసం పాముతో చచ్చే వరకు పోరాడిన వడ్రంగి పిట్ట, కన్నీరు పెట్టించే వీడియో

ఈ సృష్టిలో అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అనడంలో ఎలాంటి సందేహం లేదు.తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో మరియు పక్షుల్లో కూడా ఉంటుందని గతంలో ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.

 Viral Video Wood Pecker Fights With A Big Snake For His Chicks-TeluguStop.com

తన పిల్లల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన జంతువుల గురించి మనకు తెలుసు.ఎన్నో పక్షులు కూడా తమ పిల్లలను ప్రాణాలతో ఉంచుకునేందుకు ప్రాణాలు లెక్క చేయని సందర్బాలు చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వడ్రంగి పిట్ట తన పిల్లల కోసం ఏకంగా ప్రాణత్యాగంకే సిద్దం అయ్యింది.

ఇజ్రాయిల్‌ టూరిస్ట్‌ అసఫ్‌ అద్మోనీ ఈ వీడియోను పెరు దేశంలో చిత్రీకరించాడు.చాలా కాలం అయినా కూడా ఈ వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ట్విట్టర్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ షేర్‌ చేయడంతో ఇప్పుడు అంతా కూడా ఆ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు.

తన గూటిలో పిల్లలను వదిలేసి ఆహారం కోసం వెళ్లిన వడ్రంగి పిట్ట తిరిగి వచ్చేప్పటికి ఆ గూట్లో పాము కనిపించడంతో ఆ పిట్ట కంగారు పడినది.తన గూడులో ఉన్న పామును పొడిచి పక్కకు పంపించేందుకు ప్రయత్నించింది.

ఆ పాము ఎంతకు కూడా ఆ గూడును వదిలి వెళ్లలేదు.అయినా కూడా తీవ్రంగా ప్రయత్నించింది.తన ముక్కుతో పామును పొడిచేందుకు చూసింది.అయినా కూడా పాము వదిలి వెళ్లలేదు.పైగా తన నోటితో ఆ పిట్ట మెడను బలంగా పట్టి అటు ఇటు అంటూ కొట్టింది.మూడు నాలుగు సార్లు ఆ పిట్లను పాము గట్టిగా మెడ పట్టుకోవడంతో ఆ పట్టి బాగా నీరసపడిపోయింది.

చివరకు ఆ పిట్ట పోరాటంలో ఓడిపోయి కింద పడిపోయింది.

ఆ పిట్ట ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదు కాని పిల్లల కోసం తన గూడు తాను దక్కించుకునేందుకు ఆ పిట్ట చేసిన ప్రయత్నం నిజంగా అద్వితీయం.

ఈ వీడియో కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలిచింది.మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు కూడా ఆ పిట్టకు ఫిదా అయ్యి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పట్టుదలగా పోరాడాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube