వైరల్ వీడియో: లంచం తీసుకోవడంలో ఆ మహిళా ట్రాఫిక్ పోలీస్ రూటే సపరేట్..!

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.ప్రస్తుత డిజిటల్ రంగంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులు ఎక్కువగా ఆన్లైన్ లోనే చలాన్లు కట్టేస్తున్నారు.

 Lady Traffic Police Caught Taking Bribe Viral Video, Traffic Police Viral Video,-TeluguStop.com

ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను అతిక్రమించిన వాహనదారుల యొక్క బండి నెంబర్లను ఫోటో తీసి భారీ జరిమానాలు విధిస్తున్నారు.అయితే కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాహనదారుల నుంచి లంచం తీసుకొని వదిలేస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో బహిరంగంగా లంచం తీసుకుంటే దొరికిపోవడం ఖాయం.ఇప్పటికే చాలా మంది ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.100, 200 కోసం సస్పెండ్ అయ్యి వేల రూపాయల జీతాలను కోల్పోతున్నారు.వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన పోలీసులే తప్పటడుగులు వేస్తుంటే సమాజం సిగ్గుపడుతోంది.

పోలీస్ వ్యవస్థ లంచాల మీదనే బతుకుతుందనే ముద్ర కొందరు పోలీసు అధికారులు చేసే పనుల వలన ఇప్పటికీ అలానే ఉంది.

ఇటీవల మహారాష్ట్రలోని పిపిరీలో ట్రాఫిక్ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక లేడీ ట్రాఫిక్ పోలీస్ లంచం తీసుకుంటూ పట్టుబడింది.బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై లైసెన్సు లేని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న సమయంలో స్వాతి సొన్నార్ అనే మహిళ ట్రాఫిక్ పోలీసు లైసెన్స్ లేకుండా స్కూటీ నడుపుతున్న ఒక మహిళను పట్టుకుంది.

పైన పోలీస్ అధికారులు చలానా రాస్తున్నారు.చలానా రాస్తే చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది.

అదే నాకు కొంత డబ్బులు ఇస్తే నిన్ను విడిచి పెడతా అని లేడీ కానిస్టేబుల్ చెప్పిందో ఏమోకానీ యువతి ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది.

స్వాతి ఇతర ట్రాఫిక్ పోలీసుల అప్డేట్ అయినట్టు అప్డేట్ కాలేదేమో.ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు ఇచ్చి లంచాన్ని నేరుగా కాకుండా ఆన్లైన్ లో నొక్కుతున్నారు.కానీ, స్వాతి మాత్రం తన బ్యాక్ పాకెట్లో పెట్టేసి వెళ్లిపో అని స్కూటీ యజమానురాలికి చెప్పింది.

దీంతో ఆ యువతి లేడీ కానిస్టేబుల్ బ్యాక్ పాకెట్ లో డబ్బు పెట్టి వెళ్ళిపోయింది.అయితే ఈ దృశ్యాలను సమీపంలో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అవడంతో ఉన్నత పోలీసు అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube