వైరల్ వీడియో: ప్రాణాలకు తెగించి మరి కొండచిలువ బారినుండి కుక్కపిల్లను తప్పించిన మహిళ..!

ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో సాదు జంతువులను పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు.దీంతో జంతువులకు మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువ అయ్యాయి.

 Viral Video Woman Kills A Puppy From A Python Trap, Viral Video, Woman, Kills ,-TeluguStop.com

కొన్ని కుక్కలు వారి యజమానుల కోసం ఏకంగా వాటి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతర జంతువులతో పోరాడటం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే ఇలా కేవలం యజమానుల కోసం జంతువులు పోరాడుతాయి అనడం మాత్రమే కాకుండా, జంతువుల కోసం యజమానులు కూడా ఒక్కోసారి ప్రాణాలు సైతం అడ్డు పెట్టి వాటిని కాపాడుకుంటారు.

తాజాగా జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్ ల్యాండ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సన్ షైన్ పోస్ట్ లో జీవనం కొనసాగిస్తున్న మిచెల్లే వ్యాన్ అనే మహిళ ఓ తొమ్మిది నెలల కుక్కపిల్లను పెంచుకుంటోంది.

అయితే ఆ కుక్కపిల్ల ఆహారం తినేందుకు బయటకి రావడంతో ఆ సమయంలో అక్కడే పొదలలో దాక్కుని ఉన్న కొండచిలువ ఒక్కసారిగా ఆ కుక్కపై దాడి చేసింది.కొండచిలువకు ఉన్న పదునైన కోరలతో ఆ కుక్క పిల్లని పట్టుకొని శరీరాన్ని చుట్టేసింది.

అంతేకాదు ఆ కుక్క పిల్లను నుజ్జు నుజ్జు చేయడానికి ప్రయత్నించింది.ఆ సమయంలో ఆ కుక్క పిల్ల అరుపులు విన్న మిచెల్లే కుక్క పిల్లను కాపాడటానికి బయటికి పరుగు పెట్టింది.

ఆ సమయంలో ఆవిడ క్రిస్టమస్ పేపర్ రోల్ ను చేతిలో పట్టుకొని కొండచిలువతో పోరాడింది.అయితే అది ఎంతకీ వదలక పోవడంతో కొండచిలువను చేతితో పట్టుకొని కుక్క పిల్లని విడిపించింది.

ప్రాణాలకు తెగించి కుక్క పిల్లను కాపాడిన మిచెల్లే చివరికి విజయం సాధించింది.దీనితో ఆ కుక్కపిల్ల ప్రాణాలతో బయటపడ్డ గలిగింది.ఆ తర్వాత కొండచిలువను తీసుకొని అడవుల్లో వదిలిపెట్టారు అధికారులు.అయితే ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube