ఛానల్ డిబేట్‌లో డ్యాన్స్ చేసి నవ్వులు పూయించిన మహిళ.. వీడియో వైరల్..

సాధారణంగా ఏవైనా న్యూస్ ఛానల్ లలో డిబేట్‌లు ప్రారంభమైనప్పుడు అక్కడ పెద్ద మాటల యుద్ధమే కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు అరుస్తుంటారు.

 Viral Video Woman Dances In Live Debate Of Bengali News Channel Details, Channel-TeluguStop.com

అలాగే ఒక స్థాయికి దిగజారి అవమానించుకోవడం వంటివి కూడా చేస్తుంటారు.అయితే అన్ని డిబేట్‌లు కావు కానీ చాలా వరకు ఇలానే కొనసాగుతుంటాయి.

అసలు అంశంపై మాట్లాడడం తక్కువ మిగతా అంశాలపై వాగటం ఎక్కువ అని టీవీ ఛానల్ డిబేట్లకు పేరు పడిందంటే అతిశయోక్తి కాదు.అయితే వీటన్నిటికీ మించిన మరొక విచిత్ర చర్యకు ఓ న్యూస్ ఛానల్ డిబేట్ వేదికయ్యింది.

ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

తాజాగా బెంగాలీ న్యూస్ ఛానల్ ఒక డిబేట్ ఏర్పాటు చేసింది.

ఇందులో డిబేట్ చేయడానికి ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు.అయితే మాట్లాడుతూ మాట్లాడుతూనే ఒక మహిళ సడన్ గా డాన్స్ చెయ్యటం మొదలు పెట్టింది.

ఒక న్యూస్ ఛానల్ లో ఒక లైవ్ డిబేట్ లో ఇలా ఒక మహిళ డ్యాన్స్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.సాధారణంగా అవమానించడం, గట్టిగా అరవడం డిబేట్ లో భాగమేనని అనుకోవచ్చు.

కానీ ఇలా సంబంధం లేకుండా డ్యాన్స్ చేయడం చాలా విడ్డూరంగా, ఫన్నీ గా అనిపించింది.

వైరల్ అవుతున్న వీడియోలో మనం గ్రీన్ డ్రెస్ ధరించిన ఒక మహిళను చూడొచ్చు.అందరూ డిబేట్ చేస్తుండగా ఆమె ఒక్కసారిగా నాట్యం చేస్తూ ఊగిపోవడం చూడొచ్చు.12 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో ఆమె అందర్నీ వెక్కిరిస్తూ.డాన్స్ చేస్తూ భలే నవ్వించేసింది.ఈ వీడియోని ఎలిజబెత్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.ఇప్పటికే దీనికి 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.అలాగే వేలలో లైకులు వచ్చాయి.దీన్ని చేసిన నెటిజన్లు ఇదేం విడ్డూరమని నోరెళ్లబెడుతున్నారు.వీళ్ల కంటే కోతులే నయం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube