సాయిపల్లవి పాటకి యువతి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..!

ధనుష్, సాయిపల్లవి నటించిన మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాట ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు.

 Viral Video Woman Dance For Sai Pallavi Rowdy Baby Song Details, Sai Pallavi, Dance, Viral Latest, Songs, Viral News, Social Media, Dance Viral , Choreographers Saurabh, Anusha, Maari 2, Dhanush, Rowdy Baby Song, Viral Dance-TeluguStop.com

ముఖ్యంగా ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది.ఈ మాస్ పాటకి చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ కాలు కదుపుతున్నారు.

అయితే తాజాగా ఈ పాటకు ఒక యువతి అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

 Viral Video Woman Dance For Sai Pallavi Rowdy Baby Song Details, Sai Pallavi, Dance, Viral Latest, Songs, Viral News, Social Media, Dance Viral , Choreographers Saurabh, Anusha, Maari 2, Dhanush, Rowdy Baby Song, Viral Dance-సాయిపల్లవి పాటకి యువతి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోని @jodianoorabh అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, వేలలలో లైకులు వచ్చాయి.

కోల్‌కత్తాకు చెందిన కొరియోగ్రాఫర్స్ సౌరభ్, అనూషపాటకి అదిరిపోయే స్టెప్స్ వేసి అదుర్స్ అనిపించారు.ఒరిజినల్ పాటలో సాయి పల్లవి, ధనుష్ ఎలా స్టెప్పులను వేసారో వీరు కూడా అలానే స్టెప్స్ వేసి వావ్ అనిపించారు.

ఇక యువతి అనూష ఎంతో హూషారుగా నాట్యం చేసి చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.సాయి పల్లవి లాంటి డ్రెస్సే ఈమె ధరించింది.దీనితో సాయి పల్లవియే డ్యాన్స్ చేస్తుందా అనే అనుభూతి కలిగింది.

ఈమె డాన్స్ చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.కేక పుట్టించావ్‌ అని అనూషని చాలామంది పొగుడుతున్నారు.“ఈ డ్యాన్స్ 90 శాతం ఒరిజినల్ డ్యాన్స్ కు మ్యాచ్ అవుతుందని భావిస్తున్నాం” అని ఈ జంట @jodianoorabh ఇన్‌స్టా ఖాతాలో వీడియోను పంచుకున్నారు.షేర్ చేసిన వెంటనే ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ చక్కర్లు కొడుతోంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube