వైరల్ వీడియో... సింహాలను హడలెత్తించిన అడవి పందులు..

అడవికి రాజు సింహం అన్న విషయం మనం ఎప్పటి నుండో మనం వింటూనే ఉన్నాం.సింహం ఒకసారి గురి పెట్టిందంటే ఇక ఆ జంతువుకు భూమి మీద నూకలు చెల్లినాయని మనం అర్థం చేసుకోవచ్చు.

 Viral Video Wild Boars Chasing Lions-TeluguStop.com

ఎందుకంటే సింహం పంజా అంత బలమైనది కాబట్టి అడవికి రాజు సింహం.అయితే ఎంత బలమైనదైనా సరే కొన్ని కొన్ని సార్లు వెనుకడుగు వేయక తప్పదు.

అది సింహమైనా సరే.ఎందుకంటే ఎదురుతిరిగి బెదిరిస్తే అది సింహమైనా సరే గజగజ వణకాల్సిందే.అచ్చం ఇలానే జరిగింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే 2 ఆడ సింహాలు, ఓ మగ సింహం చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాయి.

 Viral Video Wild Boars Chasing Lions-వైరల్ వీడియో… సింహాలను హడలెత్తించిన అడవి పంది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెల్లగా ఇక ప్రశాంతంగా ఉండడంతో మెల్లగా సింహాలు నిద్రలోకి జారుకున్నాయి.అయితే ఓ అడవి పంది గాండ్రించుకుంటూ సింహాల వైపు పరుగు లు పెడుతూ వచ్చింది.

అంతే ఆ అడవిపంది గాండ్రింపుకు మంచి నిద్రలో ఉన్న సింహాలు ఒక్కసారిగా లేచి ఉలిక్కిపడ్డాయి.ఇక ముందట సింహాలు కనపడే సరికి అవ్వాక్కైన అడవి పంది ఇక వెనక్కి చూసుకోకుండా పరుగులందుకుంది.

ఇక సింహాలు మంచి నిద్ర చెడగొట్టావ్ అనే విధంగా ఉన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లను ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

#ViralVdeos #Viral Vdeo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు