వైరల్ వీడియో... అడవి దున్నకు మొసలికి భీకర యుద్ధం... పైచేయి ఎవరిదంటే?

మనకందరికీ నీళ్ళలో ఉన్నప్పుడు మొసలికి ఎంత బలంగా ఉంటుందనేది తెలిసిందే.నీళ్ళలో ఉన్నప్పుడు మొసలి నుండి ఎవరైనా సరే బ్రతికి బట్ట కట్టడం అసంభవం.

 Viral Video  . Wild Boar Crocodile Fierce Battle ... Who Has The Upper Han  Vira-TeluguStop.com

ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొసలికి నీళ్ళలో ఉన్నప్పుడు వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని చెప్పవచ్చు.అయితే ఆ తరువాత ఒక్కసారిగా మొసలి నీళ్ళ నుండి బయటకు రాగానే  ఆ బలమంతా కోల్పోయి బలహీనంగా మారుతుంది.

ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా అడవిలో జంతువులు దాహం తీర్చుకోవడానికి నీళ్ళ దగ్గరికి వస్తుంటాయి.ఆ సమయంలో అదును చూసి మొసలి దాడి చేయటం ప్రారంభిస్తుంది.

అలా జంతువును మొసలి వేటాడిన చాలా వీడియోలు మనకు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తాయి.మనం కూడా ఏదో ఒక సమయంలో అటువంటి వీడియోలను వీక్షించే ఉంటాం.

అటువంటి వీడియోలు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.మొసలి బారి నుండి జంతువు బయట పడుతుందా లేదా అని చాలా ఉత్కంఠగా మనం చూస్తుంటాం.

అయితే తాజాగా ఓ అడవి దున్నల గుంపు దాహం తీర్చుకోవడానికి  కొలను దగ్గర ఆగి దాహం తీర్చుకుంటున్న సమయంలో ఆ నీటిలో ఉన్న మొసలి ఒక అడవి దున్నపై దాడి చేసింది.

గుంపుకు దూరంగా ఉన్న ఓ  అడవి దున్న ని చాకచక్యంగా వేటాడి నీళ్ళలోకి తీసుకెళ్ళి పోయింది.ఇక ఆ అడవి దున్న తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.మొసలి చేతిలో ఆ అడవి దున్న ప్రాణాలు విడిచింది.

అయితే ఈ అడవి దున్నకు మొసలికి జరిగిన ఈ భీకర ఫైట్ వీడియోను “World Of Wildlife And Village”  యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది.దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్లను ఎంతగానో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube