వైరల్ వీడియో: భర్తను బెదిరిపోయేలా చేసిన భార్య..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీను ఉపయోగిస్తూ ఎవరి టాలెంట్ వారు నిరూపించుకుంటూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవడం మనం గమనిస్తూనే ఉంటాం.అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ అయిన తరుణంలో ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏ విషయం జరిగిన ఇట్లే అందరికీ తెలిసిపోతుంది.

 Viral Video Wife Who Threatened Her Husband, Snake, Wife And Husband, Social Med-TeluguStop.com

ఇలా కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.ఇక ఇలా సోషల్ మీడియాలో అనేక ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలకు నెటిజన్స్ నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

ఇలాంటి వీడియో ఒకటి తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మహిళ తన భర్తను ఫూల్ చేసిన సందర్భాన్ని సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతోంది.ఇక వీడియో ఆధారంగా.

లోసేనా అనే మహిళ ప్రాంక్ వీడియో కోసం తన బెడ్ రూంలో ఒక టును పాములాగా అమర్చి, గదిలో ఏదో ఉంది అంటూ తన భర్తను పిలవడం మొదలు పెడుతుంది.దీనితో ఆమె భర్త ఒక కత్తిని చేతిలో పట్టుకొని, చాలా ఫాస్ట్ గా గదిలోకి వస్తాడు, అనంతరం తన కాలుకు తగులుకున్న బెల్ట్ ను చూసి పాము అనుకుని భయబ్రాంతులకు గురి అవుతాడు.

వెంటనే చేతిలో ఉన్న కత్తితో దానిపై దాడి చేసే ప్రయత్నంలో భయపడి గదిలో నుంచి బయటకు వెళ్తాడు.

దీనితో లోసేనా ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడుతుంది.

దీనితో ఏమైంది అంటూ తన భర్త లోసేనాను అడగగా ఆమె అసలు నిజం చెప్పేస్తుంది.ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ తరుణంలో కొందరు నెటిజన్లు ఈ వీడియోకు స్పందిస్తూ కొందరు సరదాగా నవ్వుకుంటూ ఉంటే, మరికొందరు నెటిజెన్స్ అయితే ఆమె చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.నిజమైన పాము వచ్చి ఉంటే ఏమి చేస్తావ్.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

కేవలం ఎంజాయ్ మాత్రమే చేయండి ఇలాంటి వీడియోలు చేసి ఎవరిని భయబ్రాంతులకు గురి చేయవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube