వైరల్ వీడియో: పెద్దపులితో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందేమో మరి..!

సాధారణంగా చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.కొన్ని జంతువులు ఇతరులకు హాని చేసివిగా ఉంటాయి.

 Viral Video What Would It Be Like To Play Games With A Tiger-TeluguStop.com

ఇంకొన్ని అందరికీ మేలు చేసేవి అయ్యుంటాయి.పల్లెటూర్లలో కోళ్లు, కుక్కలు, ఆవులు, మేకలు, బర్రెలు, పిల్లులు ఇలా కొన్ని రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు.

కుందేళ్లను పెంచుకునేవారు కూడా ఉన్నారు.ఆ జంతువులకు వివిధ రకాల పేర్లు పెట్టి సరదాగా వాటిని పెంచుకుంటూ ఉంటారు.

 Viral Video What Would It Be Like To Play Games With A Tiger-వైరల్ వీడియో: పెద్దపులితో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందేమో మరి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ జంతువులను తమ కుటుంబంలో మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తుంటారు.

వాటికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేరు.

వెంటనే వాటిని ఆస్పత్రి తీసుకెళ్లడమో లేకుంటే వాటికి నచ్చిన వస్తువుల్ని ఇవ్వడమే, ఆ జంతువులకు కావాల్సిన తినుబాంఢారాలను ఇవ్వడమో చేస్తుంటారు.ఆ పెంపుడు జంతువులు కూడా తమ యజమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోవు.

చాలా నమ్మకంగా యజమాని కోసం పని చేస్తాయి.విశ్వాసం చూపిస్తాయి.

అందుకే జంతువులు చేసే ఏ పనులు అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా ఓ పులి వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఇద్దరు వ్యక్తులు పులిని ఆడిస్తున్నారు.అయితే వారిపై అది అరుస్తూ విరుచుకుపడింది.

ఈ వీడియోను చూసిన వారు టెన్షన్ పడ్డారు.

ఇద్దరు వ్యక్తులు ఓ పులి మెడకు బెల్టును కట్టారు.ఆ పులిని కుక్క పిల్లలా ఆడించారు.వీడియోలో ఓ వ్యక్తి పుల్లి మెడకు కట్టిన బెల్టును పట్టుకోని ఉన్నాడు.

ఇంకొక వ్యక్తి దాని తోక పట్టుకుని లాగడానికి ప్రయత్నం చేశాడు.అయితే ఆ పులి పైకి లేచింది.

అలా పైకి లేచాక దాని తోకను ఓ వ్యక్తి పట్టుకుని గట్టిగా లాగాడు.తీరా ఆ పులి ఆ వ్యక్తులను ఏమీ చేయలేదు.

దానికి ఇబ్బంది కలిగిస్తున్నా కూడా అది వారిని ఏమీ అనలేదు.చూస్తున్నట్లైతే వారిని అది క్షమించినట్లు అనిపిస్తోంది.

అందుకే అది వారిని ఏమీ అనలేదు.అయితే ఈ వీడియోను చూసిన వారు ఆందోళన చెందారు.

ఎక్కడ వారిని ఆ పులి తినేస్తుందేమోనని టెన్షన్ పడ్డారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

#Playing #Big Tiger #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు