సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలేమో.ఎందుకంటే ఈ ప్లాట్ ఫామ్ లో మనకు ఎక్కడా కనిపించని కనీసం ఎక్కడా విననటువంటి డిఫరెంట్ వీడియోలు లేదా ఫొటోలు కనిపిస్తుంటాయి.
మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధొంచిన వీడియోలు అయితే తెగ హల్ చల్ చేస్తుంటాయి.ఇక మనకు సాధారణంగా కొండచిలువ పేరు వింటేనే భయం వేస్తుంది.
ఎందుకంటే దీనికి చిక్కితే ఇంకేమైనా ఉందా అమాంతం మింగేస్తుంది.అది ఎంత పెద్ద జంతువు అయినా సరే దీనికి ఆహారం కావాల్సిందే.
మరి పులి కూడా తక్కువేం కాదు కదా.దానికి ఎదురెళ్లినా బతకడం చాలా కష్టమనే చెప్పాలి.కాగా రెండు బలశాలులు అయిన ఈ జీవులు ఎదురు పడితే ఇంకేమైనా ఉందా.పోరాటం బీభత్సం అనే రేంజ్లోనే ఉంటుందని చెప్పొచ్చు.
కాగా ఇలా ఎదరుపడిన సమయంలో రెండింటితో ఏది గెలుస్తారన్న ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఈజీగానే తలెత్తుతుంది.మరి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ కావడం కామనే కదా.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో గురించే మనం మాట్లాడుకోబోయేది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ దారిలో భారీ కొండచిలువ నెమ్మదిగా దాటేందుకు ప్రయత్నిస్తోంది.ఇక అదే దారిలో గుండా పులి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తోంది.ఇక రెండు బలశాలులు ముఖాముఖిగా తలపడాల్సి వచ్చింది.కాగా రెండు ప్రమాదకరమే కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం కదా.ఇక విశేసం ఏంటంటే కొండచిలువను చూసి పులి ఒక్కసారిగా భయపడటం కనిపిస్తుంది.దానితో పోటీ ఎందుకు అనుకుని పులి పక్క నుంచి వెళ్లిపోవడం కనిపిస్తుంది.
అంటే మొత్తానికి కొండ చిలువకు పులి భయపడిందన్నమాట.ప్రసత్తుం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది.