వైరల్ వీడియో: వేడి వేడి పిజ్జాను చల్లగా అయ్యేందుకు ఏం చేసాడంటే..?

చాలామంది స్నాక్ ఐటం కాస్త వేడివేడిగా తినాలని ఇష్టపడుతుంటారు మరికొందరైతే ఆ వేడి పదార్థాలు కాస్త చల్లారాక నిదానంగా ఆరగించవచ్చని వెయిట్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇందులో ముఖ్యంగా కాఫీ, టీ, పిజ్జా, చిరుతిండ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video What Does Hot Pizza Do To Cool It, Viral Video, Hot Pizza , Cool Wa-TeluguStop.com

అసలు విషయంలోకి వెళితే తాజాగా ఓ వ్యక్తి వేడిగా ఉన్న పిజ్జాను తినేందుకు కష్టంగా ఉందని అతడు త్వరగా ఆ పిజ్జాని చల్లార్చడానికి చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే

ఓ వ్యక్తి వారి ఇంట్లో తయారుచేసిన పిజ్జా ను ఓవెన్ నుండి తీసి వేడి వేడిగా తినడానికి ప్రయత్నించాడు.

అయితే అది తినడానికి పూర్తిగా వేడిగా ఉండడంతో దాని కోసం అతడు చేసిన పని ఇప్పుడు అందరిని నవ్విస్తుంది.ఆఫీస్ ఆ త్వరగా చల్లగా అయ్యేందుకు ఆ వ్యక్తి ఆఫీస్ కి తీసుకువెళ్లి ఏకంగా ట్యాప్ కింద పెట్టేశాడు.

అలా పెట్టిన పిజ్జా మళ్లీ అతను తినడం ఇప్పుడు వైరల్ గా మారింది.ఇకపోతే ఈ తతంగం మొత్తాన్ని సదరు వ్యక్తి యొక్క భార్య వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోకి తన భర్త ఏం చేస్తున్నాడో చూడండి అంటూ అతని భార్య వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.ఇందులో భాగంగానే ట్యాప్ వాటర్ తిప్పి నీటి కింద చల్లబరచడం కరెక్ట్ అని తన భర్త బాగా నమ్ముతారని ఆవిడ చెప్పుకొచ్చింది.

అయితే అది నా అభిప్రాయం కాదని ఆవిడ చెప్పుకొచ్చింది.ఇందులో భాగంగానే తాము కాలేజీలో పిజ్జాలు తయారు చేస్తామని కాకపోతే పిజ్జా ముక్కలను నీటి కింద పెట్టి తింటారని ఈ మధ్యనే తెలిసినట్లు ఆవిడ చెప్పుకొచ్చింది.

నీటిలో పిజ్జాను ఉంచడం ద్వారా దాని రుచి ఏమాత్రం తగ్గదని అలాగే ఉంటుందని తన భర్త చెప్పినట్లు ఆవిడ పేర్కొంది.అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

ఇలా చేయడం చాలా నేరమని సీరియల్ కిల్లింగ్ చేస్తున్నట్లు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube