వైరల్ వీడియో: వ్యాక్సిన్ వేయించుకున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆనందంలో ఏం చేశారంటే..?!

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది.ఈ మహమ్మారి వల్ల చాలామంది ఆర్థికంగా, మానసికంగా దెబ్బతిన్నారు.

 Covid Vaccine, Viral Vidoe, Social Media , Dance, Enjoying, Twitter, Ceo,boston-TeluguStop.com

అయితే అంతటి కష్ట కాలంలో కూడా ఎటువంటి విపత్తును అయిన ఎదుర్కొనడానికి మీకు మేము తోడుగా ఉంటాము అని అభయాన్ని ఇచ్చారు మన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారియర్స్ లా మనముందు ఉండి పోరాడారు.

కుటుంబాలను, పిల్లలను కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ కే పరిమితమై కరోనా బాదితులకు వైద్యం చేశారు.వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు.

ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు,వైద్య సిబ్బంది రాత్రనక, పగలనక శ్రమించి కరోనాతో యుద్ధం చేశారు.అయితే ఇప్పుడు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది.దీంతో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఆనందంతో డ్యాన్సులు వేస్తున్నారు.హెల్త్ వర్కర్లు నెలల తరబడి కష్టపడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ రావడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ క్రమంలో బోస్టన్ మహానగరంలోని ఓ హాస్పిటల్ లో కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్న కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది అదిరేటి స్టెప్స్ తో డ్యాన్స్ ఇరగదీసారు.

వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాక బోస్టన్ మెడికల్ సెంటర్​(BMC)కి చెందిన హెల్త్ వర్కర్లు ఆనందంతో డ్యాన్స్ వేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ముఖాలకు ఫేస్ షీల్డ్ పెట్టుకొని అమెరికన్ సింగర్ లిజో హిట్​ సాంగ్​ ‘గుడ్ యాస్ వెల్​‘ అనే పాటకు చిందేశారు.ఈ వీడియోను బీఎంసీ సీఈవో కాటే వాల్ష్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

వాళ్ళు ఆనందంతో వేసే డాన్స్ చూస్తే మీకు కూడా డాన్స్ వేయాలి అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube