వైరల్ వీడియో : ఈ ఏనుగు మొక్క జొన్న కంకులు ఎలా తింటుందో చూడండి...!

మన అందరికి ఏనుగులు గురించి తెలిసే ఉంటుంది.అలాగే ఏనుగులను మనం సర్కస్ లలో, జూ లలో చూసే ఉంటాము.

 Viral Video Watch This Elephant Eating Maize Crazy , Elephant, Eating, Corn , Vi-TeluguStop.com

ఎక్కువగా ఏనుగులు అడవులలో సంచరిస్తూ ఉంటాయి.మనువులు నివసించే ప్రాంతాల్లో ఏనుగులు సంచరించవు.

ఏనుగులు భారీ ఆకారంలో ఉంటాయి.అడవులలో తిరుగుతూ చెట్లు, గడ్డి, కొమ్మలు తింటూ జీవనం సాగిస్తూ ఉంటాయి.

అలాగే ఏనుగులు సాటి జంతువులను వేటాడి చంపి తినవనే విషయం మనకు తెలుసు.అంతేకాకుండా ఏనుగులకు చెరుకు గడలన్నా, వెలగ పండ్లు అన్నగాని భలే ఇష్టంగా తింటూ ఉంటాయి.

వాటితో పాటు మొక్కజొన్న పొత్తులు అరటికాయలు కూడా బాగా ఇష్టంగా తింటాయి.

అరటికాయ గెల తెచ్చి ముందుపెడితే క్షణాల్లో గుటుక్కుమనిపిస్తాయి.

చెరుకు గెడలు అయినాసరే కళ్ళు మూసి కళ్ళు తెరిచే సమయంలో తిని పారేస్తాయి.ఏనుగు ఏది తిన్నగాని భారీ మొత్తంలో తింటూ ఉంటుంది.

ఎందుకంటే ఏనుగు భారీ ఆకారంలో ఉంటుంది కాబట్టి.దాని కడుపు నిండాలంటే పెద్ద మొత్తంలో ఆహారం తినాలి కదా.అయితే మీరు ఒకటి గమనించారా.ఏనుగు ఎటువంటి ఆహారం తిన్నగాని అది డైరెక్టుగానే తినేస్తుంది.

అంటే అరటి పండ్లు తొక్కా తీయకుండా అమాంతం తన తొండంతో నోట్లో వేసుకుంటుంది.అలాగే చెరుకు గడలు, మొక్క జొన్న కండులు కూడా అంతే తొక్క తీయకుండా అలానే తినేస్తుంది.

కానీ ఒక ఏనుగు మాత్రం మొక్కజొన్న కంకులు తినే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.మనం మొక్కజొన్న కండి తినాలంటే పైన ఉన్న రేకలు తీసేసి కాల్చుకునే లేక ఉడకపెట్టుకునే తింటాము కదా.అలాగే ఈ ఏనుగు కూడా ఎక్కడ చూసి నేర్చుకుందో ఏమో మొక్కజొన్న కంకి రేకలు తీసి మరి తింటుంది.దీనికి సంబంధంచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన కొంతమంది ఈ ఏనుగుకి శుభ్రత ఎక్కువ అనుకుంటా అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ఏనుగుకు చేతులు లేవు కదా మరి మొక్క జొన్న కండి మీద ఉన్న రేకలను ఎలా తీసుకుని తింటుందని అనుకుంటున్నారా…? మొక్కజొన్న కంకిని ఒక కాలితో గట్టిగా పట్టుకుని మొక్కజొన్న కంకి మీద ఉన్న రేకులను ఒకదాని తర్వాత ఒకటిగా నోటితో లాగెసింది.అన్నీ రేకులను నీట్ గా తీసేసిన తరువాత కంకిని నోట్లో పెట్టుకుంది.కంకికి చివరన ముచ్చిక ఉంటుంది కదా దానిని కూడా తినకుండా నోటితో కొరికి పక్కన పడేసి ఒక్క మొక్కజొన్న కంకీని మాత్రమే తిన్నది.

అలా ఈ ఏనుగు మొక్కజొన్న కంకులని తినే తీరు చూస్తే భలే ఆశ్చర్యకరంగా ఉంటుంది.ఈ ఏనుగు శుభ్రతలో కంప్రమైస్ అయ్యేటట్టు లేదని నెటిజన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube