వైరల్ వీడియో: ఈ కాకి అచ్చం మనిషిలాగ ఎలా మాట్లాడుతుందో చూడండి..!

కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తే మనకు బాగా ముచ్చటేస్తుంది.ఎంతటి ఖడ్గమృగమేనా అది చేసే వింత పనులు మనుషుల్ని ఫిదా చేస్తుంటాయి.

 Viral Video Watch How This Crow Speaks Like A Human-TeluguStop.com

అయితే అడవి మృగాల తోపాటు జనంతో కలిసి జీవించే పెంపుడు జంతువులు కూడా తమ వింత చేష్టలతో ఆశ్చర్యపరుస్తుంటాయి.ఉదాహరణకి, మనుషులు పాటలు పాడుతుంటే శునకాలు కూడా రాగం తీస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి.

ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో చాలా ఉన్నాయి.అయితే మనుషుల గొంతును అనుకరించటంలో అన్ని జంతువుల కంటే ముందంజలో చిలుకలు ఉంటాయి.

 Viral Video Watch How This Crow Speaks Like A Human-వైరల్ వీడియో: ఈ కాకి అచ్చం మనిషిలాగ ఎలా మాట్లాడుతుందో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవి మనుషుల వాయిస్ ని ఇమిటేట్ చేసే ఏకైక జీవరాశులు గా బాగా ప్రఖ్యాతి గాంచాయి.మనుషులు ఉచ్చరించే పదాలను ఉన్నది ఉన్నట్టుగా అద్భుతంగా పలకగల చిలుకలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

తెలుగులో మాట్లాడే చిలుకలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్ లో బోలెడున్నాయి.

అయితే ఇప్పటివరకు కేవలం చిలుకల మాత్రమే మనుషులను అనుకరించగలవని భావించాము కానీ కాకులు కూడా మనుషుల వలె మాట్లాడగలవని పైజ్ డేవిస్ అనే ఒక అమెరికన్ యువతి షేర్ చేసిన వీడియో నిరూపిస్తోంది.ఈ వీడియోలో ఆమె తన పెంపుడు కాకి కి గింజలు అందిస్తూ హాయ్, హలో అని చెప్పారు.అయితే ఆ కాకి కూడా ఆమె లాగానే హాయ్, హలో అని మాటలు పలుకుతూ ఆశ్చర్యపరిచింది.

కొంత సమయం తర్వాత ఆమె హాయ్ హలో చెప్పింది.దీనితో ఆ కాకి మళ్ళీ పక్షిలాగా అరిచింది కానీ ఆ తర్వాత హాయ్ హలో చెబుతూ ముచ్చటగొలిపింది.

దీంతో రామచిలుకలే కాదు కాకులు కూడా మనుషుల వాయిస్ ని బ్రహ్మాండంగా అనుకరించగలవని నిరూపితమయింది.ఐతే మనుషుల లాగా మాట్లాడగల ప్రతిభ కాకి లో కూడా ఉందని తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఆఫ్రికాకు చెందిన కాకి మనిషి లాగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మీరు కూడా చూసేయండి.

#Goes Viral #Viral Video #Crow As Man #Social Media #Coversion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు