వైరల్ వీడియో: జారుడు బల్లపై జారుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న పాండాలు..!

సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.జంతువులు చేసే వింతలు, అల్లరి పనులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

 Viral Video Viral Latest Social Meida Pands Slide-TeluguStop.com

ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.మన అందరికి పాండాల గురించి తెలిసే ఉంటుంది.

చూడడానికి చిన్నగా బొద్దుగా ఆకర్షణీయంగా ఉంటాయి.వీటిని చూస్తే ఎవరికన్నా ముద్దొచ్చేస్తాయి.

 Viral Video Viral Latest Social Meida Pands Slide-వైరల్ వీడియో: జారుడు బల్లపై జారుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న పాండాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ పాండాలకు మనుషుల వలె తెలివితేటలు కూడా ఎక్కవగానో ఉంటాయండోయ్.అంతేనా ఇవి చేసే అల్లరి కూడా మాములుగా ఉండదు.

సరిగ్గా చెప్పాలంటే మన ఇంట్లో చిన్న పిల్లలు చేసే అల్లరి చేస్తాయి.ఈ పాండాలు జాతి అంతరించిపోతున్నాయని వీటిని అత్యంత జాగ్రతగా సంరక్షిస్తున్నారు.

పాండాలను స్పెషల్ గా ఒక జూలో పెట్టి మరి కాపాడుతున్నారు.అలాగే వీటిని ఆలనా పాలనా చూసుకోవడానికి ఒక ట్రైనర్ ని కూడా పెడతారు.ఇవి చేసే అల్లరితో ఆ జూ మొత్తం గందరగోళంగా మారిపోతుందంటే నమ్మండి.ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెటిజన్ల కంట పడింది.

అది చూసిన నెటిజన్లు పాండాలు చేసిన ఫీట్స్ చూసి తెగ ఆనందిస్తున్నారు.ఒకసారి ఈ వీడియోను పరిశీలిస్తే మన చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆట ఒకటి గుర్తు వస్తుంది.

అదే అండి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జారుడు బండ మీద జారుతూ ఆడుకునే వాళ్ళం గుర్తు ఉందా.ఇప్పుడు అదే ఆటను మళ్ళీ మనకు ఈ పాండాలు గుర్తు చేసాయి.

ఎంచక్కా ఒకదాని తరువాత మరొకటి చిన్న పిల్లల మాదిరిగా జారుడు బల్లపై కిందకి జారుతూ ఆడుకుంటున్నాయి.

మెల్లగా అక్కడ ఉన్న మెట్లు ఎక్కుతూ జారుడు బల్లమీదికి వెళ్లి అక్కడ నుంచి కిందకు జారడం మనం వీడియోలో చూడవచ్చు.అంతేకాకుండా ఈ పాండాలను అక్కడ ఉన్న ఒక మహిళ సంరక్షకురాలు జాగ్రత్తగా గమనిస్తూ వాటిని ఆడిస్తుంది.ఆ పాండలలో ఒక పాండా రివర్స్ లో కింద నుండి పైకి ఎక్కి అమాంతం కిందకి జారిపోతూ బోక్క బోర్లా పడుతుంది.

ఈ విధంగా పాండాలు కొద్ది సేపు ఎంచక్కా హద్దు అదుపు లేకుండా ఆడుకున్నాయి.ఈ పాండాల అల్లరి చూస్తే మనసుకి హాయిగా ఉంది అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

ఇలా 30 సెకెన్ల పాటు ఆట ఆడుకుంటున్న పాండాల వీడియోను ‘పాండా స్లయిడ్‘ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేయగా అది కాస్త నిమిషాల్లో వైరల్ అయిపొయింది.

#Pands Slide #Netizens #Social Meida #Attrack #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు