వైరల్ వీడియో: జీరో గ్రావిటీలో తేనె సిసా ఓపెన్ చేసిన వ్యో.. చివరికి ఏమైందంటే...?

చాలా మందికి అంతరిక్షంలో జరిగే విషయాలను తెలుసుకోవాలని ఉంటుంది.అందుకే వారు అంతరిక్షానికి సంబంధించిన అనేక వీడియోలను చూస్తూ ఉంటారు.

 Viral Video Vio Opening A Honey Bottle In Zero Gravity What Is The End-TeluguStop.com

అంతరిక్షంలో ఏం జరిగినా అవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.అక్కడ మనిషి చేసేటటువంటి కార్యక్రమాల వీడియోలను మనం ఆసక్తిగా చూస్తుంటాం.

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వీడియోలో భారరహిత (జీరో-గ్రావిటీ) వాతావరణంలో తేనె డబ్బా మూతను వ్యోమగామి తీశాడు.

 Viral Video Vio Opening A Honey Bottle In Zero Gravity What Is The End-వైరల్ వీడియో: జీరో గ్రావిటీలో తేనె సిసా ఓపెన్ చేసిన వ్యో.. చివరికి ఏమైందంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతరిక్షంలో తేనె మూత తీయడంతో ఆ తేనె తేలుతూ కనపడింది.ఈ వీడియోను కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి డేవిడ్ సెయింట్ జాక్వెస్ అనే వ్యోమగామి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

సాధారణంగా నీరు అనేది ద్రవ పదార్థం.

అదే ఫ్రిజ్ లో పెడితే అది గడ్డ కట్టి ఘన పదార్థంగా మారుతుంది.అదే నీటిని కాగబెడితే అది వాయు రూపంలోకి మారి ఆవిరిగా మారుతుంది.

ఈ మూడు పదార్థాలుగా ఉండే నీరు జీరో గ్రావిటీలో ఎలా ప్రవర్తిస్తుందో మనం చాలాసార్లు తెలుసుకుని ఉంటాం.ఇప్పటివరకూ వ్యోమగాములు నీటిని తప్ప ఇంకో రకానికి చెందిన ద్రవ పదార్థాన్ని జీరో గ్రావిటీ వాతావరణంలో మనకు చూపెట్టలేదు.

అయితే ఇక్కడ డేవిడ్ సెయింట్ జాక్వెస్ మాత్రం అంతరిక్షంలో వెళ్లి అక్కడ తేనె ఎలా ఉంటుందోనని చూపించాడు.

వీడియోలో డేవిడ్ ఒక తేనె డబ్బాను తీసుకున్నాడు.ఆ డబ్బాను అంతరిక్షంలో అడ్డంగా పెట్టి నిదానంగా తేనె డబ్బా మూతను తీసేయడంతో ఆ తేనె కిందకు జారింది.ఆ తర్వాత ఆ తేనె కాల్చినటువంటి ప్లాస్టిక్ లాగా సాగుతూ తేలింది.

నీల్లు లాగా తేనె గోళంలా ఏర్పడుతుందని అనుకన్నా అది జరగలేదు.ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

#Show's #Viral Video #Astronaut #Impact #F Microgravity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు