వైరల్ వీడియో: దారుణంగా నడిరోడ్డుపై వృద్ధురాలిని కింద పడేసి కొట్టిన దుర్మార్గుడు…!  

UP Man beats Old Woman Brutally on Road, UP, Old Woman, Viral Video, Social media - Telugu Netizens, Old Lady, Old Woman, Post, Social Media, Up, Up Man Beats Old Woman Brutally On Road, Viral Video

రోజు రోజుకి మానవ జీవితంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటాం.అలాంటి సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

TeluguStop.com - Viral Video Up Man Beats Old Woman Road

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఓ 70 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు.ఆమెను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదాడు.

TeluguStop.com - వైరల్ వీడియో: దారుణంగా నడిరోడ్డుపై వృద్ధురాలిని కింద పడేసి కొట్టిన దుర్మార్గుడు…-General-Telugu-Telugu Tollywood Photo Image

కింద పడేసి మరి పక్కనే ఉన్న కుర్చీ తో ఆమెను చావబాదాడు.అంతే కాదు అతని కోపం తీరకపోవడంతో ఆ వృద్ధురాలి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.

బలమైన దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు అక్కడే పడిపోయింది.వ్యక్తి ఆ వృద్ధురాలిపై దాడి చేస్తున్న సమయంలో ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆవిడ వద్దు… కొట్టవద్దని బ్రతిమాలినా అతడు ఎటువంటి కనికరం చూపించకుండా ఆమెపై విరుచుకుపడ్డాడు.

ఈ దారుణ సంఘటన కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇకపోతే ఆ దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు.

అంత పెద్ద సంఘటన జరుగుతున్న అక్కడి ప్రజలు మాత్రం ఆ ముసలావిడ కాపాడడానికి ఎవరు సాహసించలేదు.ఇందుకు సంబంధించి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది కాస్తా పోలీసులకు చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు.

అయితే ఇది వరకే ఆ నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారని గజియాబాద్ పోలీసులు తెలియజేశారు.సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

అంతేకాదు ఆ వృద్ధురాలిపై దాడి చేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.దాడి జరుగుతున్న సమయంలో వృద్ధురాలిని కాపాడేందుకు ఏ ఒక్కరు సాహసించకపోవడం అనేది చాలామంది తప్పుబడుతున్నారు.

మరికొందరు ఇలాంటి ఘోరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం అంటూ విమర్శిస్తున్నారు.

#UPMan #Old Woman #Social Media #Old Lady #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Up Man Beats Old Woman Road Related Telugu News,Photos/Pics,Images..