8 కోట్ల కారును ధ్వంసం చేసిన వ్యక్తి.. అది చేయించింది ఓనరేనట..ఎందుకంటే !

కొన్ని సార్లు ఎవరు ఏ పనులు ఎందుకు చేస్తారో కూడా అర్ధం కాదు.అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్య పోవడం మిగిలిన వారు వంతయ్యిది.

 Viral Video Unknown Man Damaging Rupees 8 Crore Car,viral News, Trending News, C-TeluguStop.com

ఎందుకంటే ఎదుట వ్యక్తి చేసే పని కారణం లేకుండా చేస్తే చూసే వారికి అర్ధం కాదు.అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఒక వ్యక్తి తన విలువైన కారును ఒక మనిషిని పెట్టి మరి ధ్వంసం చేయించుకున్నాడు.

ఆ వ్యక్తి కారును నాశనం చేసేటప్పుడు రోడ్డుపై వెళ్లే వ్యక్తి అంత మంచి కారును ఎందుకు నాశనం చేస్తున్నాడో అర్ధం కాలేదు.ఆ ఓనర్ పైన ఏదైనా పగ పెట్టుకుని ఇలా అతడి కారును పాడుచేస్తున్నాడేమో అని రోడ్డుపై వెళ్లే వ్యక్తి అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా పోలీసులకు చూపించడానికి ఆధారాలు అవసరం అవుతాయి అనుకుని ఆ క్యాక్తి కారును ధ్వంసం చేస్తుంటే వీడియో తీసాడు.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎందుకు అంత విలువైన కారును పాడుచేస్తున్నాడో ఎవ్వరికి అర్ధం కాలేదు.

కానీ పోలీసుల విచారణలో బయట పడిన నిజం తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్య పోయారు.ఆ కారు విలువ అక్షరాల 8 కోట్ల 21 లక్షలు.ఆ కారును కొట్టి కొట్టి నాశనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది.

అయితే పోలీసుల విచారణలో తెలిసింది ఏమిటంటే.ఈ కారును ధ్వంసం చేయమని ఆ కారు ఓనరే స్వయంగా వేరే వ్యక్తికి చెప్పాడని పోలీసులు తెలుసుకుని ఆశ్చర్య పోవడంతో పాటు షాక్ అయ్యారు.కారు ఓనర్ పోలీసులు కేసు గురించి చెప్పడంతో.

ఆ ఓనర్ నేనే స్వయంగా నా కారును డామేజ్ చేయించుకున్నానని పోలీసులకు చెప్పాడట.

అంతేకాదు కారును నాశనం చేసిన వ్యక్తిపై ఎలాంటి కేసు అవసరం లేదని ఆయన చెప్పడంతో ఇక పోలీసులు కూడా చేసేది ఏమి లేక అతడిని వదిలేసారట.

అయితే అలా అంత ఖరీదైన కారును ఎందుకు ధ్వంసం చేయించుకున్నాడో మాత్రం పోలీసులకు చెప్పడానికి ఆ కారు ఓనర్ ఇష్టపడలేదట.ఒక్కొక్కరిదీ ఒక్కో పిచ్చి అంటే బహుశా ఇదేనేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube