వైరల్ వీడియో: మరోమారు డోలుతో రెచ్చిపోయిన యూనివర్సల్ బాస్..!

క్రికెట్ లో యూనివర్సల్ బాస్ గా పిలవబడే క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గ్రౌండ్ లో దిగాక అవతల జట్టు బౌలర్ ఎవరైనా సరే బాల్ కొడితే బౌండరీ లైన్ అవతలే అన్నట్టుగా వీర విహారం చేసే వ్యక్తిగా మన అందరికీ సుపరిచితమే.

 Viral Video Universal Boss Provoked With Another Drum-TeluguStop.com

గ్రౌండ్ లో బ్యాటింగ్ ఎంత సీరియస్ గా చేస్తాడో ఒక్కొక్కసారి అతడు చేసే పనులు చూస్తే అందరికీ నవ్వు తెప్పిస్తాడు.ఈ జమైకా డాషింగ్ బ్యాట్స్మెన్ కేవలం స్టేడియంలోనే మాత్రమే కాకుండా మైదానంలో లేకపోయినా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తెగ హంగామా చేస్తూ ఉంటాడు.2 రోజుల క్రితం క్రిస్ గేల్ తన క్వారంటైన్ గడువును పూర్తిచేసుకుని కారణంగా మైకల్ జాక్సన్ లాగా డాన్స్ వేసి ఆయన అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులను సంతృప్తి పరిచాడు.ఇకపోతే గత సంవత్సరం కేవలం కొన్ని మ్యాచ్ లకే పరిమితమైన క్రిస్ గేల్ తాజాగా మొదలైన ఐపీఎల్ 14 విషయంలో పూర్తిగా సందడి చేయనున్నట్లు తాజాగా పంజాబ్ కింగ్స్ తెలియజేసింది.

తాజాగా ఇందుకు సంబంధించి పంజాబ్ కింగ్స్ వారి అఫీషియల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ అందులో గేల్ డోలు వాయిస్తూ అదరగొడుతున్న వీడియో ని పోస్ట్ చేసింది.ఈ వీడియో పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే వేల సంఖ్యలో లైకుల వర్షం కురిసింది.ఇక యూనివర్సల్ బాస్ అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో పెద్ద ఎత్తున తెలియజేశారు.

 Viral Video Universal Boss Provoked With Another Drum-వైరల్ వీడియో: మరోమారు డోలుతో రెచ్చిపోయిన యూనివర్సల్ బాస్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కూడా తన క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్న క్రిస్ గేల్ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ ‘మూన్ వాక్‘ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే.

అందుకుగాను కింగ్స్ పంజాబ్ తన అధికారిక ఖాతా ద్వారా క్వారంటైన్ పూర్తయింది మీ ఫేవరెట్ యూనివర్సల్ బాస్ బయటకు వచ్చాడు అంటూ తెలిపింది.ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

#Sports Updates #Chris Gayle #Viral Video #Social Media #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు