ఆకాశంలో ఎగిరే పళ్లెం.. వీడియో వైరల్‌!

ఆకాశంలో ఓ ఎగిరే పళ్లాన్ని గుర్తించారు యూఫాలజిస్ట్‌లు.మొన్నటి వరకు యూఎస్‌ నావికాదళ సిబ్బందికి కనిపించిన ఈ పళ్లాలు తాజాగా మెక్సికోలో ప్రత్యక్షమయ్యాయి.గమనిస్తే.అది నిజంగానే గ్రహాంతర వాసుల వాహనమా? కాదా? అనే సందేహం నెటిజన్లకు తోస్తోంది.ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా ఆకస్మాత్తుగా రికార్డు అయ్యే వీడియోలు.

 Viral Video Ufo Appeared At Mexico Concert-TeluguStop.com

అందులో ఏలియన్స్‌కు సంబంధించినవి స్పష్టంగా కనిపించవు.దీంతో ఈ ఏలియన్స్‌ కథ ఎప్పుడూ మిస్టరీగానే మారుతోంది.

ప్రస్తుతం మెక్సికోలో జరిగిన ఈ ఘటన జరిగింది.అక్కడ ఓ లైవ్‌స్ట్రీమక్ష కాన్సర్ట్‌ నిర్వహిస్తున్నారు.

 Viral Video Ufo Appeared At Mexico Concert-ఆకాశంలో ఎగిరే పళ్లెం.. వీడియో వైరల్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతలో అక్కడున్న బిల్డింగ్స్‌ మధ్యలో నుంచి ఏదో ప్రకాశవంతంగా కనిపించింది.ఆకస్మాత్తుగా అది ఆకాశంలోకి వెళ్లిపోయింది.

మామూలుగా గమనిస్తే అదో తారాజువ్వలా కొంతదూరం మెల్లగా పైకి వెళ్లి ఆ తర్వాత ఉన్నట్టుండి ఆకాశంలోకి వెళ్లిపోయింది.అది యూఫో అయివుంటుందని.

మూఫాలజిస్టులు చెబుతున్నారు.కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందో.ఎటువైపు వెళ్లిందే తెలియరాలేదు.

ఈ సందేహాంతో నెట్టింట వీడియో వైరల్‌ అయింది.

దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.కొందరు నెటిజెన్లు ఇది ఏలియన్స్‌ వెహికల్‌ అని.మరి కొందరు ఇది అసత్య ప్రచారం అంటూ చెప్పుకోస్తున్నారు.ఎవరి వాదన వారిది.

సాక్ష్యాంగా వీడియో తప్ప.యూఫోలకు సంబంధించిన సరైన ఆధారాలు లేవు.

ఈ కాన్సర్ట్‌ మే 24న జరిగింది.బాల్కనీ సాంగ్‌ పాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని సింగర్‌ అలైన్‌ గోమెజ్‌ చెప్పాడు.

అయితే, ఈ లోకంలో కేవలం మనం మాత్రమే ఉంటామని అనుకోలేం కదా! పైగా అదేంటో తెలుసుకునే పరిజ్ఞానం కూడా మనకు ఉండదని, తాము మ్యూజియన్లమే కానీ శాస్త్రవేత్తలం కాదు కదా అని గోమెజ్‌ అన్నాడు.మెక్సికో వాసులు కూడా దీనిపై స్పందిస్తున్నారు.

ఆకాశంలో ఆ కాంతి వింతగా అనిపించిందని చెప్పారు.ఈ వీడియోను ఓ వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టి ఆ తర్వాత డిలీట్‌ చేశాడు.కేవలం కాపీరైట్‌ సమస్య వల్లే ఆ వీడియోను డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.మళ్లీ వారం రోజుల తర్వాత ఆ వీడియోను య్యూటూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.ఏది ఏమైనా ఈ గ్రహాంతర వాసులు మనకు ఎందుకు అప్పుడప్పుడు కనిపిస్తున్నారో మనకు తెలియరాలేదు.పైడా ఇప్పటి వరకు అవి భూమి మీద ఉన్న జీవరాశులకు ఎటువంటి హాని తలపెట్టిన ఆధారాలు కూడా లేవు.

కనీసం ఏ ఒక్కరూ దాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయారు కూడా.

#Mexico #UfoFound #Youtube #Ufo In The Sky #Mufalogists

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు