వైరల్ వీడియో: నాగిని డాన్స్ తో రెచ్చిపోయిన క్రికెటర్...!?

సాధారణంగా క్రికెటర్స్ క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని సందర్భాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.క్రికెట్ ఆడే సమయంలో అవతలి జట్టు సభ్యులు ఎవరైనా అవుట్ అయినప్పుడు వారి ఆనందానికి హద్దులు ఉండవు.

 Uae Cricketer, Rohanmustafa, Nagini Dance, Sheikh Zayed, Uae Ireland Match, Roha-TeluguStop.com

అలా వారు ఆనందంలో గ్రౌండ్ లోనే ఒక్కోసారి డాన్సులతో చిందులు వేయడం, లేదా వారి ఎమోషన్స్ ను బయటపెడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అలాంటి సంఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా యూఏఈ – ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్‌ ముస్తఫా నాగిని డాన్స్ తో రెచ్చిపోయాడు.ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో 33వ ఓవర్ లో రోహన్‌ ముస్తఫా బౌలింగ్ వేసాడు.

అదే సమయంలో క్రిజ్ లో ఉన్న ఐర్లాండ్ బ్యాట్స్మెన్ లోక్రాన్‌ టక్కర్ బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ గా వెనక్కి అయ్యాడు.దీంతో ఆనందం పట్టలేని బౌలర్ రోహన్‌ ముస్తఫా కొన్ని సెకండ్లపాటు నాగిని స్టెప్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ డాన్స్ చూసి తోటి క్రికెటర్లు ” నీలో ఈ కల కూడా ఉందా.” అంటూ రోహన్‌ ముస్తఫాని అభినందించడం మొదలుపెట్టారు.

Telugu Lokran Tucker, Nagini Dance, Rohan Mustafa, Rohanmustafa, Sheikh Zayed, U

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అబుదాబి క్రికెట్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.దీనితో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఈ మ్యాచ్ భాగంగా ముందుగా టాస్ గెలిచి ఐర్లాండ్ బ్యాటింగ్ చేయగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన యూఏఈ 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ కి అవసరమైన పరుగులు చేయగలిగింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రోహన్ నాగిని డాన్స్ వీడియో ను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube