శివలింగానికి బీరాభిషేకం చేసిన దుర్మార్గులు.. వీడియో వైరల్!

దేశంలో మద్యానికి బానిసైన యువకుల పిచ్చి చేష్టలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.కొందరు ఆకతాయిలు బాగా డ్రింక్ చేసి ఆ మత్తులో జోగుతూ నీచమైన పనులు చేస్తున్నారు.

 Viral Video Two Men Seen Insulting Shivling In Chandigarh Details, Shiva , Beer,-TeluguStop.com

ఇది చాలదన్నట్టు తామేదో ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.తాజాగా వీరి వికృత చేష్టలకు పరాకాష్టగా నిలిచే మరో ఘటన చండీగడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు ఫుల్‌గా మద్యం సేవించి హిందువుల ఆరాధ్య దేవుడు అయిన పరమశివుని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా దీనిపై హిందువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో… ఓ నది ఒడ్డున ఇద్దరు యువకులు బాగా మద్యం సేవించి శివలింగానికి బీర్ తో అభిషేకం చేయడం మీరు గమనించవచ్చు.

ఈ వీడియో లో ఇద్దరు ఆకతాయిలు బూట్లు ధరించి పవిత్రంగా భావించే శివలింగం వద్దకు రావడం చూడొచ్చు.అనంతరం వీరు తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ లోని మద్యాన్ని శివలింగంపై పోయడం చూడవచ్చు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బజరంగ్ దళ్ పార్టీ కార్యకర్తల వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.వీరి ఫిర్యాదు మేరకు ఈ యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో ఒక యువకుడు చండీఘడ్ రాష్ట్రంలోని ఐటీ పార్కు సెక్టార్ 26కు చెందినవాడిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే నీలకంఠుడి పట్ల యువకులు వ్యవహరించిన తీరుపై పలు హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.హిందువుల మనోభావాలు ఎంతగానో దెబ్బ తీసిన ఈ యువకులపై కఠిన చర్యలు తీసుకొకపోతే ఆందోళనలు ప్రజ్వరిల్లుతాయని హిందూ కార్యకర్తలు హెచ్చరించారు.మళ్లీ ఎవరూ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయడానికే భయపడేలా శిక్షని విధించాలని డిమాండ్ కూడా కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube